AP Assembly session : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ Abdul Nazeer అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. అమరావతిలోని వెలగపూడి అసెంబ్లీ హాలులో ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. దీనితో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఫిబ్రవరి 12న ఈ చర్చ ప్రారంభమవుతుండగా, 13న ముఖ్యమంత్రి Chandrababu Naidu సభలో సమాధానం ఇవ్వనున్నారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ చర్చలో కీలక అంశాలు ప్రస్తావించనున్నారు.
Tamil Nadu Elections : విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

ఈ సమావేశాల్లో ప్రధాన ఆకర్షణగా ఫిబ్రవరి 14న 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను కూడా సమర్పించనున్నారు. దాదాపు నాలుగు వారాల పాటు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉండగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలపై విస్తృత చర్చ జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: