हिन्दी | Epaper

AP Assembly : ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

sumalatha chinthakayala
AP Assembly : ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

AP Assembly : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 15 రోజులు పాటు జరిగిన ఈ సమావేశాల్లో 9 బిల్లులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 85 గంటల 55 నిమిషాల పాటు వివిధ బిల్లులపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ తో పాటు పలు బిల్లులపై వాడీవేడీగా చర్చించారు. సహకార బ్యాంకుల అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరి రోజు ఏపీ అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ ఎస్సీ వర్గీరణ బిల్లును ప్రవేశ పెట్టారు.

 ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో తెలుగుదేశంతో పాటు జనసేన మద్దతు తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబుతో సహా పలువురు సభ్యులు మాట్లాడారు. 2025-26 అసెంబ్లీ క‌మిటీలను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఒక్కో క‌మిటీలో ఏడుగురు స‌భ్యుల‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క‌మిటీలు ఏడాదిపాటు ప‌నిచేయ‌నున్నాయి. అసెంబ్లీ రూల్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా అయ్య‌న్న‌పాత్రుడు, ప్ర‌భుత్వ హామీల క‌మిటీ ఛైర్మ‌న్‌గా కామినేని శ్రీనివాస్, ఎథిక్స్ క‌మిటీ ఛైర్మ్‌గా మండ‌లి బుద్ధ‌ ప్ర‌సాద్‌, ప్రివిలేజెస్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా పితాని స‌త్య‌నారాయ‌ణ‌, పిటిష‌న్ల క‌మిటీ ఛైర్మ‌న్‌గా ర‌ఘురామ‌కృష్ణంరాజు మితులయ్యారు. అనంతరం ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తూ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

📢 For Advertisement Booking: 98481 12870