ఆంధ్రప్రదేశ్ (AP) లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి DEC తొలి వారంలో నియామక పత్రాలు అందజేసి, శిక్షణకు పంపిస్తామని హోంమంత్రి అనిత (Home Minister Anita) హామీ ఇచ్చినట్లు MLC వేపాడ చిరంజీవి తెలిపారు.. ఇదే విషయమై ఆమెకు లేఖ రాయగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
Read Also: నియామకాలపై అధికారిక సూచనలు

అభ్యర్థుల్లో ఆందోళన
6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి AUGలో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు నిరాశతో ఉన్నారు. మెయిన్స్ క్లియర్ చేసిన అభ్యర్థుల్లో అర్హత సాధించిన వారికి ఎంపికల జాబితా విడుదలైంది. అయితే ఫలితాలు వచ్చిన నాలుగు నెలలు దాటినా, ట్రైనింగ్ షెడ్యూల్ ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: