ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) తాజా నియామకాల ప్రకటన విడుదల చేసింది. ఈసారి ఆయూష్ విభాగంలో మొత్తం 107 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. రాష్ట్రంలోని వైద్య రంగంలో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
Read Also: TG SET-2025: దరఖాస్తు గడువు పొడిగింపు – నవంబర్ 6వరకు అవకాశం
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 15, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని బోర్డు సూచించింది.ఈ నియామకాలు ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, నేచురోపతి & యోగా విభాగాల్లో జరుగనున్నాయి.

అర్హతలు
పోస్టు ఆధారంగా అర్హతలు వేరువేరుగా ఉన్నాయని అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్, సీఏ, ఐసీడబ్ల్యుఏ, ఎం.డి, BAMS, BHMS, BUMS, BNYS వంటి విద్యార్హతలతో పాటు అనుభవం కలిగి ఉండాలి. APMC రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, BC, EWSలకు రూ.750. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: