‘మొంథా’ తుఫాన్ వేగంగా తీరంవైపు దూసుకువస్తోంది. ఆంధ్రప్రదేశ్(AP Alert) విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజా సమాచారం ప్రకారం, గడిచిన ఆరు గంటల్లో తుఫాన్ గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతానికి మచిలీపట్నం నుండి 160 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 240 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుండి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు.
Read Also: Chennai: రోడ్డుపై దొరికిన నోట్ల కట్టలు.. నిజాయితీ చాటుకున్న మహిళ

తీర ప్రాంతాల్లో ఇప్పటికే గాలుల వేగం పెరుగుతుండటంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. రాబోయే గంటల్లో తుఫాన్(AP Alert) మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి తుఫాన్ పరిస్థితులను రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తోంది.
APSDMA అప్రమత్తం – ప్రజలు ఇంట్లోనే ఉండాలని సూచన
తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తక్షణమే తీరానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్థానిక అధికారులను లేదా విపత్తు సహాయ కేంద్రాలను సంప్రదించాలని APSDMA విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, విద్యుత్ శాఖ, రెవెన్యూ విభాగాలతో సమన్వయాన్ని బలోపేతం చేసింది. అవసరమైతే పునరావాస కేంద్రాలను కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: