పలాస (శ్రీకాకుళం జిల్లా) : పలాస (palasa) మండలం గరుడఖండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ఘటన స్థలంలో మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యారు. కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read also: AP ఉద్యోగాల పేర్లు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

Two youths die in road accident in Palasa
బ్లాక్ డేరబా గ్రామానికి చెందిన
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చేసిన ప్రాధమిక ధర్యాప్తు ప్రకారం మృతులు పాతపట్నం మండలం సరళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు, తలగాపు వేణుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు సుశాంత్ (23) ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్ ద్రమగిరి బ్లాక్ డేరబా గ్రామానికి చెందిన యువకునిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: