(AP) రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెండో రోజూ సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దృష్టి సారించిన ఏసీబీ, అనేక చోట్ల పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అవినీతి, అవకతవకలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ ట్యాంపరింగ్ వంటి చర్యలు జరిగినట్లు అధికారిక సమాచారం బయటకు వచ్చింది.
Read Also: Minister Gottipati: కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి గొట్టిపాటి

(AP) డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉందని తెలుస్తోంది.ఏసీబీ వర్గాల ప్రకారం, ఈ సోదాలు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఒకేసారి నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, తెనాలి, రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ సోదాల్లో అనేక కీలక పత్రాలు, నగదు,లెక్కల్లో చూపని నగదును పెద్దమొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: