ఒక పని జరగాలంటే లంచం(ACB) ఇవ్వాల్సింది. పని క్షణాల్లో జరగాలంటే బల్లకింద చేతులు తడపాల్సిందే. ఇలీవల కాలంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులలో అవినీతి శృతిమించిపోతున్నది. అటెండర్ మొదలుకుని, సూపరింటెండెండ్ వరకు డబ్బు ఇవ్వనిదే ఫైలు కదలదు. కాళ్లు అరిగేలా ఎంతగా తిరిగి, బ్రతిమాలుకున్నా లాభం లేదు. మొహంమీదే ఆ పనికి ఇంత వాటా ఇవ్వాల్సిందే అని అడిగేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం దీనిపై దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఏపీలో అవినీతి కేంద్రాలుగా మారిన సబ్ రిజిస్టార్ ఆఫీసుల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వం అవినీతి నిరోధానికి ఎసెన్ని చర్యలు తీసుకుంటున్నా రిజిస్టార్ కార్యాలయాల్లో మాత్రం పరిస్థితి మారడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏకంగా 120 ఆఫీసులపై ఏకకాలంలో దాడులు జరుపుతోంది.

Read also: ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
ఫిర్యాదు నేపధ్యంలో దాడులు
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై వస్తున్న ఫిర్యాదుల నేపధ్యంలో అవినీతి నిరోధక బ్యూరో (ACB) అధికారులు ఇవాళ ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, విజయనగరం జిల్లా భోగాపురం, సత్యసాయి జిల్లా చలమత్తూరు, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటతో పాటు పలు చోట్ల ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఆయా కార్యాలయాల్లో రికార్డుల్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు.
భారీ ఎత్తున లావాదేవీలు రాష్ట్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో భారీ ఎత్తున లావాదేవీలు జరుగుతున్నా రికార్డుల్లోకి రావడం లేదనే ఫిర్యాదులు ఎప్పటటి నుంచో చోట్ల డబ్బు కోసం రికార్డుల్ని మూర్చేస్తున్న ఘటనలపై ఫిర్యాదులు అందుతున్నాయి. పలుచోట్ల అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఏసీబీ దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు పలుచోట్ల దాడులు జరిపి కీలక డాక్యువమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: