విజయవాడ : ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీకి రాజధాని అమరావతిలో (Amaravati) రూ.165 కోట్ల అంచనా వ్యయంతో అత్యాథునిక జి+5 భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం విజయవాడ-గుంటూరు మధ్య కాజ వద్ద అద్దె భవనంలో నడుస్తున్న జ్యుడీషియల్ అకాడమీకి సీఆర్డీఏ పిచ్చుకలపాలెం వద్ద 4.83 ఎకరాల స్థలాన్ని 60 ఏళ్ళ లీజుకు కేటాయించింది. అక్కడ భవనాన్ని కూడా సీఆర్డీఏనే నిర్మించనుంది. ఈ ప్రాంతం హైకోర్టుకు సుమారు…3 కి.మీ దూరంలో ఉంది. ఈ భవన నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఇటీవల ఆమోదం లభించింది.
Read also: AP: నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

A judicial academy building will be constructed in Amaravati
జ్యుడీషియల్ అకాడమీ హైకోర్టు అథ్వర్యంలో పనిచేసే శిక్షణ సంస్థ… న్యాయమూర్తులు, న్యాయాది కారులు, కోర్టుల సిబ్బందికి నైపుణ్యాల పెంపు, కోర్టు మేనేజ్మెంట్, న్యాయ విజ్ఞానంలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. కొత్తగా సర్వీసులో చేసిన జడ్జిలతో పాటు ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి నైపుణ్యాభివృధ్ధి శాక్షణ ఉంటుంది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి రాజధానిలో అత్యాథునిక క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఎకడమిక్ బ్లాక్, నివాస సదుపాయాలు, డిజిటల్ క్లాత్రూంలు, ఆడిటోరియం, సమావేశ మందిరాలు, క్రీడలు, వినోద సదుపాయాలు, కెఫెటేరియా వంటివి ఉంటాయి. దానిలో భాగంగటానే ఇప్పుడు భవన నిర్మాణం చేపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: