हिन्दी | Epaper
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

AP: అటవీ శాఖలో ఇంటి దొంగలపై ఉక్కుపాదం

Saritha
AP: అటవీ శాఖలో ఇంటి దొంగలపై ఉక్కుపాదం

పీలేరు : (AP) అటవీ శాఖలో ఇంటి దొంగల పని పట్టింది కూటం ప్రభుత్వం. శాఖలో ఉంటూ సంఘవిద్రోహ శక్తులతో చేతులు కలిపి ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఇద్దరు అధికారులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించింది. ఈ సంఘటనకు వివరాల పీలేరులో ఇంటి దొంగల పైన కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఇద్దరు ఫారెస్ట్ అధికారులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా ఫారెస్ట్ అధికారి సాయిబాబా ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పీలేరు అటవీ శాఖలో పనిచేసే నలుగురు అటవీశాఖ అధికారులు తలుపుల సెక్షన్ ఫారెస్ట్ బీట్ అధికారి టి.శ్రీనివాసన్ అలియాస్ స్వామి, ఉస్తికాయల పెంట సెక్షన్ బీట్ అధికారి టి.రెడ్డప్ప, అసిస్టెంట్ బీట్ అధికారి ఎం. విజయ భాస్కర్, నూతన కాల్వ చెక్ పోస్ట్ అధికారి సిఎం జయప్ప 2021లో ఈ ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తూ విలువైన అక్రమంగా ఎర్రచందనం సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లకు సహకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో స్మగ్లర్ల నుంచి భారీగా ముడుపులు తీసుకుంటూ వారికి రాచబాట పరిచారు. ఈ తరహాలోనే తరలిస్తున్న స్మగ్లర్లకు సహకరించిన అధికారులను అరెస్టు చేసి రిమాండుకు తరలించగా వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం వీరు 2022లో తిరిగి విధుల్లోకి చేరారు.

Read Also: AI : తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు

AP: అటవీ శాఖలో ఇంటి దొంగలపై ఉక్కుపాదం
A firm hand against internal culprits in the Forest Department.

A firm hand against internal culprits in the Forest Department.

స్మగ్లర్లతో చేతులు కలిపిన అధికారులపై కఠిన చర్యలు

ఈ కేసుపై (AP) ప్రత్యేక అధికారి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ను అటవీశాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇదిలావుండగా ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన తరువాత అటవీ శాఖలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటవీ శాఖలో పనిచేసే ఇంటి దొంగల పైన ఉక్కుపాదం మోపారు. పీలేరు అటవీశాఖలో అక్రమ ఎర్రచందనం (Red sandalwood) రవాణాలో పట్టుబడి అరెస్ట్ అయిన ఫారెస్ట్ బీట్ అధికారులలో జయప్ప మృతి చెందగా, ఫారెస్ట్ బీట్ అధికారి టి.శ్రీనివాసన్ అలియాస్ స్వామి, ఏబిఒ ఎం. విజయ భాస్కర్లను సర్వీసు నుంచి తొలగిస్తూ జనవరి 3వ తారీఖున జిల్లా అటవీశాఖ అధికారి సాయిబాబా ఉత్తర్వులు జారీచేశారు. అదే విధంగా రెడ్డప్ప అనే అధికారిపై చర్యలు చేపట్టారు. అయితే దీనిని స్థానిక అధికారులు మీడియాకు తెలియజేయక పోవడం గమనార్హం. ఏది ఏమైనా ఇంటి దొంగల పైన అటవీ శాఖలో కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంపై పీలేరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870