ఎపి కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ కృష్ణయ్య
విజయవాడ : ఏపీలో (AP) రీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వరకు ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు (AP Pollution Control Board) చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య తెలిపారు. రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన అంతర్జాతీయ మెటల్ రీసైక్లింగ్ కాన్ఫరెన్స్ ఎక్స్ పోకు రాష్ట్రం తరపున డాక్టర్ పి. కృష్ణయ్య పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పలువురు నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఏపీ రీసైక్లింగ్ మోడల్ గురించి ఇంకా రాష్ట్ర కొత్త విధానాల గురించి ఆయన ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడానికి పరిశ్రమలకు భూమి కేటాయింపులు, పలు రకాల సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ఇంకా ఇది ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సమావేశం అని, ఇక్కడ పరిశ్రమలు, సాంకేతికత ఆవిష్కరణలకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించామని వివరించారు.
Read Also: South Central Railway: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్

పర్యావరణ పరిరక్షణకు కొత్త దిశ
ఎగ్జిబిషన్ లో జరిగిన సమావేశంలో అధునాతన సాంకేతికతలను(AP) ప్రదర్శించారని ముఖ్యంగా, రీసైక్లింగ్కు సంబంధించిన ఆధునిక సాంకేతికతలు దృష్టిని ఆకర్షించాయని చెప్పారు. ఇటువంటి వేదికలు సాంకేతిక సమాచారాన్ని పంచుకోవడే కాకుండా రాష్ట్రాల తరపున ఒకరి అనుభవాలను మరొకరు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి తోడ్పడతాయని చెప్పారు. రీసైక్లింగ్ అనేది పర్యావరణ అనుకూల ప్రక్రియ అని డాక్టర్ పి. కృష్ణయ్య వివరించారు. వ్యర్థాల నిర్వహణ, వనరుల పునర్వినియోగం పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడుతుందనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రాథమిక లక్ష వివరించారు. ఈ సమావేశం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వ్యవస్థీకృత రీసైక్లింగ్ను నిర్ధారించడానికి ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రీసైక్లింగ్ విధానాన్ని అభివృద్ధి చేసిందని కృష్ణయ్య వెల్లడించారు.
కొత్త రీసైక్లింగ్ విధానం అభివృద్ధి
రీసైక్లింగ్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలను అనుసరించడం వల్ల వ్యర్థాలను ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని తద్వారా వాటిని సులభంగా పారవేయడానికి బదులుగా తిరిగి ప్రాసెస్ చేయవచ్చు అని డాక్టర్ కృష్ణయ్య అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అలాగే విద్యాసంస్థలు, రీసైక్లింగ్ పరిశ్రమల చురుకైన భాగస్వామ్యం ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని తెలిపారు. వ్యర్థాలు కేవలం నిరుపయోగకరంగా ఉండకుండా ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం రెండింటికీ ప్రయోజనకరంగా ఉండేలా చూసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష చెప్పారు. రాష్ట్రాలు, దేశాలను స్థిరమైన అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లడంలో ఇటువంటి అంతర్జాతీయ సమావేశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కృష్ణయ్య అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: