విశాఖలో(AP) నెలకొల్పుతున్న తమ సంస్థలో 25వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని IT సంస్థ కాగ్నిజెంట్ CEO రవికుమార్ వెల్లడించారు. సంస్థ భవనాలకు CM CBN శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో CEO మాట్లాడారు..ముందుగా 8 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్న కాగ్నిజెంట్ ఇప్పుడు మరింతగా విస్తరించాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు(CM Chandrababu) సమక్షంలో ఉద్యోగాలు 25 వేలు కల్పిస్తామని సీఈఓ రవికుమార్ ప్రకటించారు.
Read Also: అంధ మహిళల విజయం..పవన్ ఘనసత్కారం

కొత్త ఆధునిక కార్యాలయానికి 8,000 మంది ఉద్యోగులు
విశాఖకు రావడం తన సొంతింటికి వచ్చినట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ(AP) క్యాంపస్ లో పని చేయడానికి ఆసక్తి ఉన్న వారి నుంచి ఇటీవల కాగ్నిజెంట్ ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. నాలుగున్నర వేల మంది ఉద్యోగులు తాము వెంటనే విశాఖకు షిఫ్ట్ అవుతామని చెప్పారు.ప్రస్తుతం శంకుస్థాపన చేసిన క్యాంపస్ 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నారు. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో పూర్తి కానున్న కాగ్నిజెంట్ టెక్నాలజీస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. అప్పటి అప్పటివరకు అద్దె కార్యాలయంలో కార్యకాలపాలు కొనసాగిస్తుంది. విశాఖ క్యాంపస్‌లో ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి పెడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: