కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ 2029 నాటికి పక్కా ఇళ్లు (AP) అందించాలనే లక్ష్యంతో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది దరఖాస్తులు చేసారు, అందులో 7.5 లక్షల మంది అర్హులని ప్రభుత్వం (Government) అంచనా వేస్తోంది. వీరికి ఇళ్లు నిర్మించనుండగా, మిగతా దరఖాస్తుదారులకు స్థలాలు కేటాయించనున్నారు.
Read Also: AP: విద్యతోనే సమాజంలో మార్పు: సీఎం చంద్రబాబు

ఈ కార్యాక్రమంలో 2.61 లక్షల టిడ్కో ఇళ్లు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి పంపిణీ చేయనున్నారు. (AP) ఈ భారీ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం హడ్కో నుండి రూ. 4,451 కోట్లు రుణంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వము ఆర్ధికంగా బలహీనమైన వర్గాల కోసం అందుబాటులోని ఇళ్లు, సౌకర్యాలను అందిస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రతిజ్ఞ కలిగినట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: