కాశీబుగ్గలో జరిగిన దర్శన తోపులాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం మన అందరి హృదయాలను కలచి వేసింది. ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే అని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మన దేశంలో ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ‘క్రమశిక్షణ’ పాటించకపోవడం. బస్సు ఎక్కాలన్నా, రైలు ఎక్కాలన్నా, చివరికి విమానం ఎక్కే సమయంలో కూడా చివరికి చదువుకున్న వారు కూడా ఒకరిని ఒకరు తోసుకుంటూ విమానం ఎక్కుతున్న పరిస్థితి. ఇక ఇటీవల కాలంలో దేవాలయాల్లో దర్శనాలు సందర్భంగా, నదుల్లో పుణ్య స్నానాలు చేసే సమయంలో అనేక మంది అకాల మరణం చెందడానికి ప్రధాన కారణం క్రమశిక్షణ పాటించకపోవడం. ఆత్రుతతో (anxiety) తోపులాటలు జర గడం వల్ల అనేకమంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపో తున్నాయి. ముఖ్యంగా ప్రజలు, యువత, భక్తులు, ప్రయాణి కులు ప్రతీ సందర్భంలోనూ ఓర్పు, సహనం, క్రమశిక్షణ పాటిస్తేనే, ఇటువంటి అకాల మరణాలు నివారించగలం అని గ్రహించాలి. కొంతమేరకు విజ్ఞతతో వ్యవహరించాలి. మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాల విసర్జించాలి. పూర్వ కాలంలోనూ, అంతగా చదువులేని కాలంలో ప్రజలు సంయమనంతో దర్శనాలు చేసుకునే వారు, సురక్షితంగా ఇంటికి చేరుకునే పరిస్థితి ఉండేది. నేడు అనేక మంది విద్యావంతులు, అనేక విషయాలపై అవగాహన ఉన్నవారు కూడా ప్రమాదాల్లో చిక్కుకోవడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.. దీని అంతటికీ కారణం అత్యుత్సా హం’ ఆత్రుతతో (anxiety) మాత్రమే. ఇక ప్రభుత్వాలు, వివిధ ఆధ్యాత్మికసంస్థలు, బాబాలు, స్వాములు ఇటీవల కాలంలో ప్రజల్లో మత పర మైన కార్యక్రమాలు ఎక్కువగా చొప్పించడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘భక్తిని పూర్తిగా వ్యాపారమయం చేయడం’ జరుగుతుంది. దీనికితోడు సామాజిక మాధ్యమా ల్లో, యూ ట్యూబ్లు, వివిధ ఛానెల్స్ మతపరమైన భావ జాలం విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ, ప్రజలను దైవ కార్యక్రమాల్లో మితిమీరి ముంచితేల్చడం జరుగుతుంది.
Read Also : http://Kanchi Temple: కాంచీపురం దేవాలయంలో బల్లుల తాపడాలు మార్చిడం పై కలకలం

ప్రభుత్వాలు సామాజిక మాధ్యమాలు ప్రజలను, యువతను సమాజంలో విజ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, ఉద్యోగ ఉపాధి అవ కాశాలు సాధించే విధంగా, నైపుణ్యాలు నేర్చుకునే విధంగా, అప్పుల ఊబిలో కూరుకుపోకుండా స్వయం సమృద్ధి సాధిం చే విధంగా మన రాష్ట్రాన్ని, దేశాన్ని అతి త్వరలో” వికసిత భారత్’గా తీర్చిదిద్దే విధంగా దిశానిర్దేశం చేయాలిగాని, మితి మీరిన భక్తిలో మునిగి తేలేటట్లు చివరికి ప్రాణాలు కోల్పో యే విధంగా ప్రోత్సహించడం ఏమాత్రం శ్రేయోష్కరం కాదు.ఇక మనదేశంలో ప్రాచీన కాలం నుండి ప్రాచుర్యం పొందిన అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంలో భూస్వాములు, సంపన్నులు, కార్పొరేట్ వర్గాలు, బాబాలు, స్వాములు, ధనికులు ‘పేరు’ కోసం, రక రకాల కొత్త దేవాలయాలు, ఆశ్రమాలు నిర్మిస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘ప్రైవేటు దేవాలయాలు, ఆశ్రమాలు’ ఎక్కడబడితే అక్కడ నిర్మిస్తున్నారు. ప్రతీరోజూ, ప్రతీఘడియ రకరకాల పండుగలు, పర్వదినాలు అనేక పేర్లుతో ప్రజలను మత భావోద్వేగానికి గురయ్యాటట్లు చేస్తున్నారు. ప్రజలు కూడా ఆ ప్రభావంలో పడిపోవడం శోచనీయం. ఇకనైనా ప్రజలు భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడు అని, మనసు మంచిదైతే అంతా మంచి జరుగుతుంది అని ఆలోచన చేయాలి. సెక్యులర్ భావంతో పనిచేయవలసిన ప్రభుత్వాలే మత క్రతువులు ప్రోత్సహించడం, కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగాప్రభుత్వాధినేతలే మత క్రతువుల్లో పాల్గొనడం వల్ల, ప్రజలు కూడా ఉద్వేగభరితంగా పాల్గొన్నడం జరుగు తుంది. దీంతో కొన్ని చోట్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ప్రజలు ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించకుండా ఉండటానికి కూడా ఈమత క్రతువులు ఉప యోగపడుతున్నాయి. ‘అధిక ధరలు, ప్రైవేటీకరణ, నిరుద్యోగం’ వంటి పలు సమస్యలుప్రజలు ప్రభుత్వాలను నిలదీయకుం డా ఉండటానికి మాత్రం ఈమత క్రతువులు ఉపయోగపడు తున్నాయి అనే విషయం వాస్తవమే.
– ఐ.ప్రసాదరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: