ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న లే అవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ (Layout Regularization Scheme) గడువును మరోసారి పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం 2026 జనవరి 23 వరకు ఈ స్కీమ్ అమల్లో కొనసాగనుందని స్పష్టం చేసింది. చాలా కాలంగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న ప్లాట్ యజమానులకు ఇది పెద్ద ఊరటగా మారింది.
Read Also: CII Summit 2025: ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి

ఇతర ఛార్జీలు చెల్లించి అప్లై
ప్లాట్ల యజమానులు LTP ద్వారా పీనలైజ్, ఇతర ఛార్జీలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. గడువులోగా దరఖాస్తు చేస్తే ఓపెన్ ప్లేస్ ఛార్జీల్లో 50% రాయితీ ఇస్తారు. ఈ అవకాశం మళ్లీ ఉండకపోవచ్చంటున్నారు. కాగా రెగ్యులర్ కాని PLOTSలో నిర్మాణాలకు అనుమతివ్వరు. నిర్మాణాలున్నా తొలగిస్తారు. రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధిత జాబితాలో చేరుస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: