దేవస్థానంలో కిలాడీలు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్న ఉద్యోగులు నిద్రావస్థలో ఆడిట్
కాకినాడ : అన్నవరం (Annavaram) దేవస్థానం పాలన గాడి తప్పుతోంది. ‘వడ్డించే వాడు మనవాడైయితే కడ బంతిలో కూర్చున్నా ఆహార పదార్థాలు వాటంతట అవే వస్తాయి’ అన్నచం దంగా ఉన్నతాధికారులు కాంట్రాక్టర్కు కొమ్ము కాయడంతో లక్షల్లో దోపిడీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని దేవస్థానం దృష్టికి తీసుకొచ్చిన కార్మికులు ఉన్న తాధికారి రోజుకో పుణ్యక్షేత్రంలో గడుపుచున్నారు. పాలన కంటే ప్రొటోకాల్ కే అధిక ప్రాదాన్యత ఇస్తున్నారు. ఇది ఆసరా చేసుకుని క్రింద స్థాయి ఉద్యోగులు రాజ్యమేలుచున్నారు. తప్పుడు బిల్లులతో కూడిన ఫైల్స్ పంపినా ఇఓ కళ్ళు మూసుకొని సంతకం పెట్టేస్తారులే అన్న ధీమా ఉద్యోగులది అనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. దేవస్థానం ఉద్యోగులు తప్పుడు ఫైల్స్ (Wrong files) పెట్టినప్పటికీ, పసిగట్టాల్సిన ఆడిట్ అధికారులు సైతం పట్టించుకోక పోవడం వెనుక మతలబులేమిటో అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నవరం దేవస్థానం లో శానిటరీ కాంట్రాక్టర్ భాగోతం ప్రకం పనలు రేపుతోంది. 349 మంది పారిశుధ్య కార్మికుల ఈపిఎఫ్ కాంట్రాక్టర్ మింగేసాడు. ప్రతీ నెలా కార్మికులకు చెల్లిస్తున్నట్లు నకిలీ చలానాలు సృష్టించాడు. గుడ్డివాని ఎదుట దీపం పెట్టిన చందాన అధికారులు అవి అసలివా, నకిలీవా అని పరిశీలిం చకుండా కాంట్రాక్టర్కు పేమెంట్ మంజూరు చేసేసారు. కార్మికులు ఈ విషయం బయట పెట్టేవరకూ రాష్ట్రం లోనే పేరెన్నిక గన్న పెద్ద దేవస్థానం ఉన్నత అధికారులు గమనించక పోవడం శోచనీయం.

అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణలో మోసాలు బట్టబయలు
అన్నవరం (Annavaram) దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు సంబందించి రెండు సంవత్సరాల క్రితం వరకూ హైదరాబాద్ కు చెందిన కెఎల్ టీఎస్ సంస్థ చూసేది. వాళ్ళ గడువు పూర్తయ్యాక, ఈ ఏడాది మార్చి 1 తేదీ నుండి గుంటూరుకు (Guntur) చెందిన కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్ వారికి నామినేటెడ్గా శానిటరీ నిర్వహణ బాద్యతలు అప్పగించారు. దేవస్థానంకు చెందిన అన్ని పరి >>2 సర ప్రాంతాలలో పారిశుధ్య పనులు నిర్వహణకుగాను 349 మంది పారిశుధ్య సిబ్బంది తో పనులు చేయించుటకు గాను శానిటరీ సంస్థకు నెలకు 52 లక్షల రూపాయలు దేవస్థానం చెల్లించుటకు ఒప్పందం. అందులో కార్మిక చట్టం ప్రకారం గుత్తేదారు 16.25 శాతం ఈపిఎఫ్ గా సిబ్బంది పేరున జమ చేయాలి. ముందుగా ఈపిఎఫ్ కట్టాకే దేవస్థానం బిల్లు మంజూరు చెయ్యాలనేది నిబంధన. ఇక్కడే అసలు కిటుకు దాగిఉంది. మార్చి నుండి మే నెలవరకూ కార్మికులకు ఈపిఎఫ్ చెల్లించినట్లు నకిలీవి సృష్టించి, కాంటాక్టర్ దేవస్థానం నుండి కోటి 60 లక్షల రూపాయలు బిల్లును పొందాడు. ఈ విషయంపై కొందరు పారిశుధ్య కార్మికులు ఇఓ కు ఫిర్యాదు చేసారు. కాంటాక్టర్ సమర్పించిన ఈపిఎఫ్ చలానాలు పరిశీలించి అధికారులు విస్తు పోయారు అవి నకిలీవని తేలింది. కాంటాక్టర్ ను పిలిపించి, దేవస్థానం ఇఓ దీనిపై ప్రశ్నించగా, కాంటాక్టర్ తప్పు సరిదిద్దుకొనే ప్రయత్నంలో భాగంగా మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఈ నెల 9 వ తేదీన 10 లక్షల 9 వేలు, 14 వ తేదీన 9లక్షల 90 వేలు, 15 వ తేదీన 9లక్షల 75 వేల రూపాయలు పారిశుధ్య కార్మికులకు ఈపిఎఫ్ గా చెల్లించిన చలానాలు అందజేసి చేతులు దులుపుకున్నారు. అంతకు ముందు సమర్పించిన చలానాలు నకిలీవన్న విషయం కాంట్రాక్టర్ ఒప్పుకున్నట్లేనన్నది స్పష్టమైంది. ఇటువంటి మోసాలు పసిగట్టాల్సిన ఆడిట్ అధికారుల తీరు అనుమానస్పదమేనని విమర్శలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి శానిటరీ కాంట్రాక్టర్ పైన, అందుకు సహకరించిన ఉద్యోగులపైనా క్రమ శిక్షణా చర్యలు చేపట్టాలని భవిష్యత్తులో ఏ ఉద్యోగి ఇటువంటి మోసపూ దోపిడీకి సహకరించకుండా ఉద్యో గం నుండి సస్పెండ్ చేయాలని సత్యదేవుని భక్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయమై దేవాదాయ శాఖ మంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
అన్నవరం ఆలయం దేనికి ప్రసిద్ధి చెందింది?
అన్నవరం ఆలయం పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి. ఇది భక్తులకు ప్రసిద్ధి గాంచిన ప్రముఖ హిందూ దేవాలయం.
అన్నవరం ఆలయ నేపథ్యం ఏమిటి?
అన్నవరం ఆలయం శ్రీవారి ప్రసిద్ధి కలిగిన పురాతన దేవస్థానం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో భక్తుల ఆకర్షణ కేంద్రంగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: AP: హరిత రాజధానిగా అమరావతి