అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీధి కుక్కల బెడద మరోసారి ప్రాణాలు తీసింది. గత కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలు బహిరంగంగా తిరుగుతూ ప్రజలపై దాడి చేసే ఘటనలు పెరుగుతున్నాయి. ఎక్కడికక్కడ కుక్కలు మనుషుల వెంటపడడం, పిల్లలు, మహిళలు భయంతో బయటకు రావడానికి భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాయచోటిలో జరిగిన తాజా సంఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది. లక్ష్మీపురం(Annamaiah District) నివాసి ఫజిల్ (42) ఆదివారం అర్ధరాత్రి గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్ స్టేషన్ సమీపం గుండా ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా, అక్కడ తిరుగుతున్న వీధి కుక్కలు అతడిని గమనించి బైక్‌ను వెంబడించాయి. ఒక్కసారిగా కుక్కలు గట్టిగా మొరుగుతూ అతని బైక్‌కు దగ్గరగా రావడంతో ఫజిల్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
Read also: కుక్కకాటు భయాందోళన.. రోజుకు 300 మందికి పైగా ఆస్పత్రికి క్యూ

అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
కుక్కల నుంచి తప్పించుకునేందుకు తన బైక్‌ను వేగంగా నడపడం ప్రారంభించిన ఫజిల్ ఆ గందరగోళంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న గుడి గోడను బలంగా ఢీకొట్టాడు. ఢీకొన్న ప్రభావం వల్ల అతడి తలకు, శరీరానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు శబ్దం విని పరుగున వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాయచోటి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్ట్‌మ్ నిమిత్తం ఆసుపత్రికి(hospital) తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర ఆగ్రహావేశం నెలకొంది. అనేకసార్లు మున్సిపాలిటీ అధికారులకు వీధి కుక్కల సమస్యపై ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పట్టణంలో కుక్కల పెరుగుదలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: