ఏపీలో రైతులకు గుడ్ న్యూస్! అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదలకు సిద్ధం
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి పండుగ ముందు పెద్ద శుభవార్త రానుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను (Annadata Sukhibhava) ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులను దీపావళి పండుగకు ముందు రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులను అదే సమయంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- దీపావళికి ముందు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల
- పీఎం కిసాన్ యోజనతో పాటు రైతుల ఖాతాల్లో నిధుల జమ
- సుమారు 47 లక్షల మంది రైతులకు లాభం
Nvidia CEO: విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా సీఈఓ
ఏపీ ప్రభుత్వం ప్రతి అర్హ రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తం పీఎం కిసాన్ యోజన కింద రూ.2,000, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5,000గా కలిసి అందుతుంది.
గత ఆగస్టులోనే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన కింద రూ.7,000 చొప్పున సుమారు 47 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు రెండో విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
సమాచారం ప్రకారం, ఈసారి కూడా ప్రభుత్వం దీపావళి పండగకు ముందు నిధులను విడుదల చేసి రైతుల ముఖాల్లో వెలుగులు నింపనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :