తిరుమల Ankurarpana : సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రూపమైన తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వరునికి ఆ బ్రహ్మదేవుడే విచ్చేసి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఈనెల 23వ తేదీ మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఆరోజు సాయంత్రం నిత్యకైంకర్యాలన్నీ పూర్తిచేసుకున్న తరువాత రాత్రి 7 గంటలకు శ్రీనివాసుడి సర్వసేనాధిపతి విశ్వక్సేనాధిపతి ఆలయం నుండి వెలుపలకు వచ్చి నాలుగు మాఢవీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.
అంకురార్పణం శాస్త్రోక్త విధానం
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం, బీజావాహనం ముఖ్యమైనవి. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది అత్యంత విజయవంతం (Success) కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహిస్తారు. 23వ తేదీ రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సేనాధిపతిని వసంతమండపానికి వేంచేపుచేసి అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహిస్తారు. ఆ తరువాత పవిత్రమండపంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపడతారు.

అంకురార్పణం ఆధ్యాత్మిక ప్రాధాన్యం
భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్ను సేకరించి సుగంధద్రవ్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కావున దీనికి “అంకురార్పణం” అనే పేరు వచ్చింది.
అంకురార్పణం ఎందుకు నిర్వహిస్తారు?
ఏదైనా ఉత్సవం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ, పవిత్రత కోసం అంకురార్పణం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఏమి చేస్తారు?
మృత్సంగ్రహణం, భూమాత పూజలు, సుగంధద్రవ్యాల నాటడం, నవధాన్యాలకు మొలకలు రాకపాటు పూజలు నిర్వహిస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :