దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్,(Infosys) అమెరికా సహా 50 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) ఐటీ రాజధానిగా మారుతున్న విశాఖపట్నంకి పెద్ద సంచలనం తీసుకొచ్చింది. ఇప్పటికే ఇక్కడ తాత్కాలిక క్యాంపస్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్ఫోసిస్, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించి శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Amaravati: విజయవాడలో ఐటీ హబ్‌గా మారే ఏరియాలు ఏవంటే?

ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఎండాడ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కేటాయించగా, ఇతర రాయితీలపై చర్చలు కొనసాగుతున్నాయి. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక ఈ నెలలోనే అధికారిక ప్రకటన రావచ్చని అవకాశాలు ఉన్నాయి. ఐటీ మంత్రి నారా లోకేష్ విశాఖ సిద్ధంగా ఉండాలని, ఈ నెలలో ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు నగరానికి వస్తున్నారని ట్వీట్ చేశారు.
విశాఖలో ఐటీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది
విశాఖ ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్ తాత్కాలిక మరియు శాశ్వత క్యాంపస్, రిలయన్స్-బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ ప్రతిపాదనలు, టీసీఎస్ శాశ్వత క్యాంపస్ మరియు యాక్సెంచర్ క్యాంపస్ వంటి ఐటీ పెట్టుబడులు సాక్ష్యం. ఈ భారీ ప్రాజెక్టులు నగరాన్ని ప్రాంతీయ ఐటీ హబ్గా(AndhraPradesh) మారుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో ఐటీ రంగ అభివృద్ధి, నూతన ఉద్యోగావకాశాలు, నగర ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: