కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గల గురుకుల పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థులకు పచ్చకామెర్లు సోకటంతో జిల్లాలో కలకలం రేగింది. ఇప్పటికే వారం రోజులు వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, విశాఖ, పార్వతీపురం, కురుపాం ఆసుపత్రులలో వందల సంఖ్యలో చికిత్స పొందడంతో తమ పిల్లలకు ఏం అవుతుందోనన్న భయంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కురుపాం మండలం శివన్న పేటలోగల గురుకుల పాఠశాలలో(Gurukul School) సుమారు 612 మంది విద్యార్థులు చదువుతున్నారు.
Read Also: Hyderabad: పర్యాటక శాఖతో ఒప్పందాలు – ఆరు ఫైవ్‌స్టార్ హోటళ్లు

వీరిలో ఇప్పటికే రక్త పరీక్షలు నిర్వహించి 100 మందికి పైగా విద్యార్థులకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఇంకా పలువురికి రక్త పరీక్షలు రిపోర్ట్లు(Blood test reports) రావాల్సి ఉంది. గురుకుల పాఠశాలలో కనీస వసతులు లేకపోవడం, వాటర్ ప్లాంట్ పని చేయకపోవడంతో కలుషితమైన నీరు త్రాగడం వల్ల పచ్చకామెర్లు సోకినట్లు తెలుస్తోంది. పచ్చకామెర్లతో గత నెల 26న 9వ తరగతి చదువుతున్న కల్పన(14) తన ఇంటి వద్ద మృతి చెందింది. ఈ నెల 1న పదవ తరగతి విద్యార్థిని పువ్వల అంజలి(15) విశాఖ కేజిహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ఆదివాసీ గిరిజన సంఘాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు అలాగే పాఠశాలను పరిశీలించి గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు లోపించాయని, కలుషిత నీరు త్రాగటం వలన విద్యార్థులకు వ్యాధి సోకి మృతి చెందారని అన్నారు. ఆదివాసి సంఘాలు విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆందోళన చేపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
దీంతో విద్యార్థులందరికీ రక్త పరీక్షలు నిర్వహించి వెంటనే వాటి రిపోర్టులను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల్లో ఇప్పటికే 112 మందికి వ్యాధి సోకినట్లు ఇందులో 28 మంది పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. మిగిలిన వారికి జిల్లా ఆసుపత్రి పార్వతీపురం, కురుపాం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం రాష్ట్రస్థాయి వరకు వ్యాపించడంతో గురుకులాల ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.గౌతమ్ శనివారం రాత్రి పాఠశాలను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని అలాగే రక్షిత మంచినీరు అందివ్వాలని ఆమె అధికారులకు ఆదేశించారు.
ఇద్దరు విద్యార్థినిల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్
కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిల మృతి బాధా కరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కురుపాం బాలికల గురుకులంలోని విద్యార్థినిలు అనారోగ్యానికి గురైన విషయం తెలిసి బాధపడినట్లు చెప్పారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి పిల్లలు పచ్చకామెర్లు సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇద్దరు విద్యార్థినులు వేర్వేరు రోజుల్లో ఇంటి దగ్గర ఒకరు, మరొకరు ఆసుపత్రిలో మృతి చెందినట్లు పవన్ కల్యాణ్ వివరించారు. మృతి చెందిన విద్యార్థినిలు కుటుంబాలకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: