విజయవాడ : కోర్టు దిక్కార కేసులో సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళాలని ఆంధ్రా విశ్వవిద్యాలయం (Andhra University) పూర్వ ఉపసంచాలకులు ప్రసాదరెడ్డి ఆశ్రయించనున్నారు. న్యాయవాదుల సమాచారాన్ని అనుసరించి ఆయన హైకోర్టు అప్పీల్ కు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాదుల సహకారంతో ప్రయత్నిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి (వీసీ) ప్రసాదరెడ్డిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు నెలరోజుల సాధారణ జైలు. శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. కోర్టు ఉత్తర్వులు అంటే ప్రసాదరెడ్డికి లెక్కలేదని, విచారణ సందర్భంగా సొంత తెలివితేటలు వాడుతూ, మొండి వైఖరి అవలంభించారని. తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను వరుసగా ఉల్లంఘించారని, ఇలాంటి వ్యవహార శైలి న్యాయ పరిపాలనకు తీవ్ర నష్టమని తెలిపింది. కోర్టు ఆదేశాలు అంటే ఆయనకు గౌరవం తక్కువ అని వెల్లడించింది. వీసీ బాధ్యతల నుంచి వైదొలిగేంత వరకు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని పేర్కొంది. కొత్త వీసీ వచ్చాక కోర్టు ఉత్తర్వులను అమలు చేశారని తెలిపింది.
Read also: Stree loans: ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలకు భారీగా లోన్లు

ఇలాంటి వ్యక్తిపై కనికరం చూపితే న్యాయవ్యవస్థకు నష్టమని వ్యాఖ్యానించింది. జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించాక ప్రసాదరెడ్డి తరఫు న్యాయవాది ఆప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును సస్పెండ్ చేయాలని కోరారు. అందుకు న్యాయమూర్తి సానుకూలంగా స్పందిస్తూ 6 వారాలు సస్పెండ్ చేశారు. అప్పీల్ దాఖలు చేయకపోయినా, దాఖలు చేసిన అప్పీల్లో స్టే రాకపోయినా ఈనెల 22న సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ప్రసాదరెడ్డిని ఆదేశించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఏయూ సైన్స్, టెక్నాలజీ కళాశాల బోటనీ విభాగంలో భోచనా సిబ్బందిగా నూకన్నదొర 2006 జులైలో నియమితులు అయ్యారు. ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒప్పందం పద్దతి పై కొనసాగారు. 17 ఏళ్ల పాటు సేవలు అందించారు. నూకన్నదొరను విధుల నుంచి తొలగిస్తూ ఏయూ వీసీ 2022 నవంబర్ 18న ఉత్తర్వులు ఇచ్చారు. 2022 మే నుంచి చెల్లించాల్సిన జీతం బకాయిలను నిలిపేశారు.
తనను విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ నూకన్నదొర 2023లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2023 మార్చి 7న విచారణ జరిపిన న్యాయమూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పిటిషనర్ను కొనసాగించాలని నిర్దిష్ట కాలానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అప్పటి వీసీ ప్రసాదరెడ్డిపై నూకన్నదొర హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. ఇటీవల ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగా ప్రసాదరెడ్డి కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని తేల్చారు. జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఈ ఏడాది నవంబర్ 20న తీర్పు ఇచ్చారు. తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఒకసారి కోర్టు ఉత్తర్వులు ఇచ్చాక దానిని యథాతథంగా అమలు చేయడమే అధికారుల విధి అని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని, అంతే తప్ప కోర్టు ఉత్తర్వులకు విభిన్న అర్ధం చెప్పడానికి వీల్లేదన్నారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవా? కాదా? అనే విషయాన్ని కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో తేల్చలేదని, ఆ ఉత్తర్వులకు కట్టుబడి వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఈ పరిణామాల నడుమ ప్రసాదరెడ్డి సుప్రీం కోర్టుకు అప్పిల్ దాఖలు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: