ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వేగంగా మారుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) శనివారం ఓ ప్రకటనలో, రానున్న మూడు గంటల పాటు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
మోస్తరు నుంచి భారీ వర్షాలు
APSDMA ప్రకారం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి: MD ప్రఖర్ జైన్ సూచనలు
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ (Prakhar Jain)ఈ సందర్భంగా ప్రజలకు కీలక సూచనలు చేశారు:
- పిడుగులు పడుతున్న సమయంలో చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దు
- విద్యుత్ స్తంభాలు, పెద్ద హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలి
- ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి
- రైతులు, కూలీలు, పశువుల కాపరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
ఈదురు గాలులకు అవకాశం – బయట అవసరమైతే మాత్రమే వెళ్లండి
బలమైన గాలులు వీచే అవకాశమున్న నేపథ్యంలో, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి అపాయాలకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం అందిస్తున్న సూచనలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: