నెల్లూరు క్రైమ్ : గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్, విగ్రహం స్వాధీనం ప్రశంసలందుకున్న సంతపేట పోలీసులు పంచలోహ కృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగుడు అపహరించుకుని వెళ్లారు. ఫిర్యాదు అందుకున్న సంతపేట పోలీసులు గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి సంతపేట పోలీసు స్టేషన్లో స్థానిక ఇన్స్పెక్టర్ వై. వి సోమయ్య వివరాలను వెల్లడించారు. కామాటివీధిలో సంతాన బాలగోపాల కృష్ణమందిరం ఉంది. వాచ్మెన్ అంకయ్య రోజులాగానే బుధవారం ఉదయం ఆలయం గేట్లు తెరచి పనులు చేసుకుంటుండగా గుర్తుత లియని దుండగుడు లోనికి ప్రవేశించి గర్భగుడిలోని పంచలోహ (panchaloha) కృష్ణుని ఉత్సవ విగ్రహం, ఇత్తడి గంటను అపహరించుకుని వెళ్లారు. అర్చన చేసేందుకు ఆలయంకు వచ్చిన పూజారి రఘునందన్ ఈ విషయాన్ని ఆలయ చైర్మన్ సీహెచ్ భాస్కర్కు ఫోన్లో తెలియజేశారు.
Read also: Welfare homes: సంక్షేమ వసతి గృహాల్లో రూ.9.28 కోట్లతో ఆర్వో ప్లాంట్లు

Panchaloha Krishna idol stolen in Nellore
సీసీ ఫుటేజ్ లు ఆధారంగా
దీంతో భాస్కర్ చోరీ ఘటనపై సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సోమయ్య కేసు నమోదు చేసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ లు ఆధారంగా నిందితుడు నార్తురాజుపాలెంకు చెందిన పాత నేరస్థుడు వెంకయ్యగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా కోటమిట్టకు చెందిన షేక్ షఫికి విగ్రహం విక్రయించినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు షఫిని అదుపులోకి తీసుకుని చోరి సొత్తు స్వాధీనం చేసుకుని నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. లక్ష వరకు ఉంటుంది. వెంకయ్యపై చీరాల రైల్వే పోలీసుస్టేషన్లో, ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్లో దొంగతనం కేసులున్నాయని ఇన్స్పెక్టర్ చెప్పారు. ఈ కేసులో ప్రతిభకనబరిచిన సంతపేట సీఐ వైవి సోమయ్య ఇతర సిబ్బందిని టౌన్ ఇన్చార్జి డిఎస్పి గిరిధర్, రూరల్ డిఎస్పి శ్రీనివాసరావులు అభినందించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: