हिन्दी | Epaper

Andhra Pradesh: ఇక డ్రోన్లను కూడా బుక్ చేయొచ్చు

Saritha
Andhra Pradesh: ఇక డ్రోన్లను కూడా బుక్ చేయొచ్చు

ఏపీ (Andhra Pradesh) ప్రభుత్వం వ్యవసాయంలో సాంకేతికత వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. వ్యవసాయంలో టెక్నాలజీని ప్రవేశపెట్టి రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే అన్నదాతలకు డ్రోన్లు (Drones) అందుబాటులోకి తెస్తోంది. రైతులకు డ్రోన్లు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తోంది.

ఈ క్రమంలోనే ఆటో, ట్యాక్సీ క్యాబులు బుక్ చేసుకున్న తరహాలోనే రైతులు డ్రోన్లు బుక్ చేసుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. క్యాబులను బుక్ చేసుకున్నట్లుగా డ్రోన్ల సర్వీసులను కూడా బుక్ చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. తమ మొబైల్ ఫోన్ సాయంతో.. యాప్ లేదా కాల్ సెంటర్‌ను సంప్రదించి తమకు కావాల్సిన సమయానికి డ్రోన్లను బుక్ చేసుకోవచ్చని వివరించారు.

Read Also: Atchannaidu: రైతులకు త్వరలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తాం

Andhra Pradesh: ఇక డ్రోన్లను కూడా బుక్ చేయొచ్చు

(Andhra Pradesh) డ్రోన్ల సాయంతో రైతులు పురుగుల మందులు, ఎరువులను పంటలకు పిచికారీ చేయవచ్చని సూచించారు. వేగంగా పిచికారీ చేయటంతో పాటుగా ఎరువులు, పురుగుల మందుల వృథా కూడా కావని అన్నారు. డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తే మొక్కలకు నేరుగా పురుగుల మందులు, ఎరువులు చేరతాయని అన్నారు.

డ్రోన్ల వినియోగం ద్వారా కూలీల కొరత సమస్యకు చెక్ పడుతుందని అధికారులు చెప్తున్నారు. పొలం విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా డ్రోన్లు తక్కువ సమయంలోనే మందులను పిచికారీ చేయగలుగుతాయని చెప్తున్నారు. దీంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు ఉండవని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870