हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Gottipati Ravi Kumar: రాష్ట్రవ్యాప్తంగా రూ.6వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు

Rajitha
Gottipati Ravi Kumar: రాష్ట్రవ్యాప్తంగా రూ.6వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు

రాష్ట్రంలో విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.6వేల కోట్లతో పనులు చేపట్టినట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అదితి విజయలక్ష్మీ గజపతిరాజు, కోళ్ళ లలిత కుమారి, ముత్తుముల అశోత్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లా విద్యుత్ లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 200కు పైగా 33/11 కేవీ సబ్ స్టేషన్లు అవసరం ఉందని గుర్తించి, వాటి నిర్మాణానికి చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు.

Read also: Nakkapalli Steel Plant : నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కు డేట్ ఫిక్స్

Gottipati Ravi Kumar

New substations across the state at a cost of Rs. 6,000 crore

విజయనగరం ప్రాజెక్టులు మరియు అండర్ గ్రౌండ్ కేబులింగ్

విజయనగరం వేణుగోపాలపురం సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రస్తుతం రీటెండరింగ్ దశలో ఉన్నాయని, 2027 మార్చినాటికి పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో రూ.46కోట్ల వ్యయంతో 220కేవీ, 132కేవీ లైన్ల పనులు పూర్తి అయ్యాయని, వాటిని త్వరలో చార్జ్ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వేణుగోపాలపురంలో రూ.77కోట్లతో సబ్ స్టేషన్ పనులు కొనసాగుతున్నాయని మంత్రి సభకు వివరించారు. విజయనగరంలో కూడా విశాఖపట్నం తరహాలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు కోరగా, ఆ వ్యవస్థ ఖర్చుతో కూడుకుందని మంత్రి తెలిపారు. నిధుల లభ్యత, అవసరాన్ని బట్టి ఆ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ – ప్రభుత్వ ప్రణాళికలు

గిద్దలూరు నియోజకవర్గంలో 220కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కోరగా, విద్యుత్ శాఖ ఫిజిబిలిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరిగిందని, దీంతో రోజువారీ విద్యుత్ వినియోగం 263 మిలియన్ యూనిట్ల నుండి 280 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి పెంపుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 400కేవీ, 220కేవీ, 132కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.

నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యం

రైతులకు పెద్దఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, వ్యాపార, పారిశ్రామిక, గృహ అవసరాల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత లేకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలు, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 33/11కేవీ సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పటిష్టంగా లేని రాయబార కార్యాలయాలు!

పటిష్టంగా లేని రాయబార కార్యాలయాలు!

పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

కాలుష్య కాసారంలో నగరాలు!

కాలుష్య కాసారంలో నగరాలు!

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: మంత్రి లోకేష్

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: మంత్రి లోకేష్

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

విద్యార్థినుల నిజాయితీ పై మంత్రి లోకేష్ ప్రశంసలు

విద్యార్థినుల నిజాయితీ పై మంత్రి లోకేష్ ప్రశంసలు

📢 For Advertisement Booking: 98481 12870