हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Andhra Pradesh: టార్గెట్ పెద్దిరెడ్డి? అన్నమయ్య జిల్లా మూడు ముక్కలు

Rajitha
Andhra Pradesh: టార్గెట్ పెద్దిరెడ్డి? అన్నమయ్య జిల్లా మూడు ముక్కలు
  • జిల్లా కేంద్రం మదనపల్లెకు మార్పు రాయచోటిలో మిన్నంటిన ఆందోళనలు- ఇటు రాజంపేటలోనూ నిరసనల వెల్లువ – పార్లమెంట్ నియోజకవర్గం కనుమరుగు – రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

కడప : ఎట్టికేలకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న రాయచోటిని మూడుముక్కలు చేయడం వల్ల ఒరిగింది ఏమీ లేదు. అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న ఆరు నియోజకవర్గాల్లో రాజంపేట కడపలో, రైల్వేకోడూరు, తిరుపతిలో మిగిలిన వాటిని అన్నమయ్య జిల్లాలో కలిపారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు అన్నమయ్య జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు కలిపి మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు. జిల్లా పేరు మార్చకపోవడంతో మదనపల్లి వాసులు అసంతృప్తిగా ఉన్నారు. జిల్లా కేంద్రం మార్చడంతో రాయచోటి వాసులు రగిలిపోతుండగా తమకు జిల్లా ఇవ్వలేదని రాజంపేట ప్రజలు సైతం తీవ్ర ఆవేదంలో ఉన్నారు. రాజంపేట ప్రాంతానికి చెందిన అన్నమయ్య పేరు పెట్టి మదనపల్లె జిల్లా కేంద్రం ఏమిటని రాజంపేట వాసులు వాపోతున్నారు.

Read also: Hyderabad: సైబర్ స్కిల్స్ ఉపయోగించి ATM చోరీ.. వెంటనే అదుపులో

జిల్లా కేంద్రాన్ని రాయచోటిలో కొనసాగిస్తే రైల్వే కోడూరు తిరుపతిలో కలపాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సిఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం. అందువల్లనే రైల్వే కోడూరు.. తిరుపతి జిల్లాలో విలీనం చేయగా రాజంపేటను కడవలో రాయచోటి బదులుగా మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో పార్లమెంట్ పరిధిలోని మెజారిటీ ప్రజానీకం ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాయచోటికి చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించి ప్రజాగ్రహానికి గురై భారీ మూల్యం చెల్లించారన్న సంగతి తెలిసిందే. ఫలితంగా నవ్యాంధ్రప్రదేశ్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయింది. దీనిపై రాజకీయ పార్టీలు అప్పట్లో భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది రాష్ట్ర విభజనకు సంబంధించి నాడు కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ వేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.

ఇక్కడ మాత్రం కనీసం జిల్లా కేంద్రం మార్పు చేస్తున్నట్లు కూడా చెప్పకుండా ఉన్న ఫలంగా జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలించారు. ఈ నిర్ణయం పట్ల రాయచోటి వాసుల్లో ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. ఎన్నికల హామీ పక్కనపెట్టి… జిల్లా కేంద్రం మార్పు గత వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. కడప నుంచి మూడు నియో జకవర్గాలు చిత్తూరు నుంచి మూడు నియోజక వర్గాలతో కలిపి అన్నమయ్య జిల్లా ఏర్పాటైంది. తెదేపా అధికారంలోకి వస్తే జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు మారుస్తానని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటికి వచ్చిన చంద్రబాబు వైసిపి చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.

రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని, దీనిపై ఎటువంటి అపోహలు వద్దని చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు నియోజకవర్గంలో లో పర్యటించారు. ఈ సమయంలో కూడా రాయచోటి మార్పుపై మాట్లాడలేదు. అంతేకాక ఇటీవల రాజంపేటలో పర్యటించగా ఆ సందర్భంలో రాజంపేట వాసులు జిల్లా ఏర్పాటు చేయాలని సభలో నినాదాలు చేయగా స్పందించిన సిఎం చంద్రబాబు రాజంపేటలో టిడిపిని ఓడించారని, రాయచోటిలో తమ పార్టీ గెలిచిందని అలాం టప్పుడు వారికి ఎలా అన్యాయం చేస్తానని సిఎం తెలిపారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే రాయ చోటి మార్పు ఉండదని అందరూ భావించారు. ఒక్కసారిగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మారుస్తున్నట్లు ప్రకటన రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870