విజయవాడ : హిడ్మాతోపాటు ఇతరుల ఎన్కౌంటర్ పై పీపుల్స్ యూనిటి ఫర్ సివిల్ లిబర్టీస్ హ్యూమన్ రైల్స్ ఫోరం అధ్యక్షురాలు జయ వింధ్యాల హై కోర్టులో పీల్ దాఖలు చేశారు. మావోయిస్టు (Maoist) అగ్ర నేత హిడ్మా మరణం ఒక సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సిట్టింగ్ జడ్జీతో లేదా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జయ వింధ్యాల దాఖలు చేసిన పిటీషన్ విచారణ సందర్భంగా ఎపి అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచారు.
Read also: AP: ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్

మరింత లోతుగా అధ్యాయనం చేయాలని
మెజిస్టీరియల్ విచారణపై పిటిషనర్లకు అభ్యంతరం ఉంటే సెషన్స్ జడ్జ్ లేదా మెజిస్ట్రేట్ ని ఆశ్రయించాలని పేర్కొన్నారు. నేరుగా హైకోర్టులో ప్రజా ప్రయో జన వాజ్యం దాఖలు చేయడం కంటే, కింది కోర్టులో ఫిర్యాదుచేసి విచారణ కోరడం సరైన ప్రక్రియ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత చట్టబద్దంగా జరగాల్సిన మెజిస్టీరియల్ విచారణ ఇప్పటికే మొదలైందని, దర్యాప్తు సంస్థలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయని ఎజి కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే.. అడ్వకేట్ జనరల్ దమ్మాళపాటి శ్రీనివాస్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం, ఈ విషయంలో మరింత లోతుగా అధ్యాయనం చేయాలని పిటీషనర్ తరుపు న్యాయవాదిని ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: