Andhra Pradesh: ఆరోగ్యకరమైన సమాజంలో బాలికలు ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీని ప్రభుత్వం కొనసాగిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలోని విద్యార్థులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను అందించడంపై శాసనమండలిలో సభ్యులు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7వ తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను సరఫరా చేయడం జరుగుతోందన్నారు.
Read Also: Vetlapalem explosion: ఘటన పేలుడులో 28కి చేరిన మృతులు

ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పులు
గతంలో విద్యార్థినులకు ఏడు రెగ్యులర్ సైజ్, మూడు లార్జ్ సైజ్ న్యాప్‌కిన్లు ఇచ్చేవారని.. అయితే క్షేత్రస్థాయిలో తీసుకున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రస్తుతం 5 రెగ్యులర్, 5 లార్జ్ సైజ్ ప్యాడ్‌లను ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు. ఐవీఆర్ఎస్ (IVRS) ద్వారా విద్యార్థినుల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరిస్తున్నామని, ఇందులో 96 శాతం మందికి ప్యాడ్‌లు అందుతున్నాయని, 85 శాతం మంది నాణ్యత బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
అంతముందు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నెలసరి వచ్చే సమయంలో సరైన హైజీన్ ప్రొడక్ట్స్ అందక పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్.. ఎన్జీవోల సహకారంతో హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్, పర్సనల్ హైజీన్‌పై బాలికల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: