हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Andhra Pradesh: నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి

Anusha
Andhra Pradesh: నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉండే అవకాశముంది. గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ఈసారి సుమారు రూ.10,000 కోట్ల మేర పెంపు ఉండనున్నట్లు భావిస్తున్నారు.ఉదయం 11:15 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

Read Also: Marriage Dates: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల సందడి ప్రారంభం

Andhra Pradesh: Finance Minister to present budget in the Assembly today
Andhra Pradesh: Finance Minister to present budget in the Assembly today

బడ్జెట్‌పై చర్చించి ఆమోదం

ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసనమండలిలో హోం మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర బడ్జెట్‌ను, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి. ఈ నెల 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలుపనున్నారు.

అభివృద్ధి, సంక్షేమం, మహిళలు, రైతులకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు తగిన నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అలాగే పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం, రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870