हिन्दी | Epaper

Andhra Pradesh: ‘భూముల’బిల్లుకు కేబినెట్ ఓకే

Rajitha
Andhra Pradesh: ‘భూముల’బిల్లుకు కేబినెట్ ఓకే

విజయవాడ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. నీటిపారుదల శాఖలోని 7,189 నిర్వహణ పనులకు పరిపాలనా ఆమోదం తెలిపారు. భూములు బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ లో ఆమోదం లభించింది. గాజువాక (Gajuwaka) రెవెన్యూ గ్రామ పరిధిలో 1000 చ.గజాల వరకూ క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో 6 నెలలు పొడిగిస్తూ అనుమతించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములలో నివాసాలు ఏర్పరుచుకున్న అనధికార ఆక్రమణల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును జూలై 30వరకు క్యాబినెట్ ఆమోదించింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కీసరపల్లి గ్రామంలోని సర్వే నెం. 29/8లోని 3.84 ఎకరాల భూమిని కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ కార్యాలయం, నివాస గృహాల నిర్మాణం” కోసం ఉపయోగించేందుకు అనుగుణంగా గతంలో ఇచ్చిన జీవోలో మార్పు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.

Read also: Bapatla: మరో మహిళతో భర్త జీవనం.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య

Cabinet okays 'Lands' bill

Cabinet okays ‘Lands’ bill

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో 45.60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్ ఆర్ ఈడీసీఏపీకి కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపన కోసం కేటాయించే ప్రతిపాదనకు ఆమోదించనుంది. నంద్యాల జిల్లా సంజామల మండలం నోస్సం గ్రామంలో 1500 ఎకరాలు భూమిని 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కోసం ఎన్ఆర్ఆఈ డీసీఏపీకి కేటాయించేందుకు క్యాబినెట్ ఒకే చెప్పింది. విశాఖపట్నం ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలో 18.57 ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయింపుపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి, తిరుపతిలో ఏపీఎస్ఎసీ కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. డీఎస్ డబ్ల్యూఎస్ (సవరణ) బిల్లు 2026ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అమరావతి మెరినా అభివృద్ధికి (పీపీపీ మోడల్) 33 సంవత్సరాల లీజు ప్రాతిపదికన, టెండర్లకు ఆహ్వానించింది.

సౌర విద్యుత్, బయోగ్యాస్ మరియు భూకేటాయింపులపై కీలక నిర్ణయాలు

పీఎంఏవై గ్రామీణ్ 2.0లో యూనిట్కర్ రూ.2 లక్షల 39 వేలు గా నిర్ణయించి క్యాబినెట్ అంగీకారం తెలిపింది. రామాయపట్నం పోర్ట్భివృద్ధి కార్పొరేషన్ రుణ పునర్వినియోగం, రాష్ట్ర హామీ, కంఫర్ట్టర్ జారీ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఎన్నికల ఓటర్ల జాబితా ప్రచురణకు ఏడాదికి 4 అర్హత తేదీలను కల్పించేందుకు సవరణ బిల్లుకు కేబినేట్ ఆమోదించింది. యాగంటి పీఎస్పీ (1000 ఎండబ్ల్యూ), రాజుపాలెం పీఎస్సీ (800 ఎండబ్ల్యూ) ప్రాజెక్టులను ఏపీ జెన్కో స్వతంత్రంగా అమలు చేయడానికి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏపి ట్రాన్స్కోలో కడవ జోన్ పరిపాలన కోసం అసిస్టెంట్ సెక్రటరీ పోస్టు సృష్టి ప్రతిపాదనకు ఆమోదం తెలపింది. సుజ్ఞాన్యోక్సిస్ సంస్థల అభ్యర్థన మేరకు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల అమలు గడువును మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. ఇక మంత్రి మండలి సందర్భంగా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై ఆయన స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

పీఎంఏవై 2.0, జలజీవన్ మిషన్ మరియు మంత్రులకు సీఎం ఆదేశాలు

మంత్రులందరూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తప్పనిసరిగా అసెంబ్లీలో ఉండాలని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత తమ పేషీల్లో ఉండి ఎమ్మెల్యేల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అసెంబ్లీలో ఆవు కథలు చెప్పవద్దని, సమాధానాలు క్లుప్తంగా, అర్ధ మయ్యేలా ఉండాలని మంత్రులకు చెప్పారు. మాట్లాడే ప్రతి మాట బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు. శైలంలో భక్తులపట్ల పోలీసుల తీరుపైనా సీఎం స్పందించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. క్యూలైన్లో ఇబ్బంది పడుతున్న పెద్దవాళ్లను బయటకు తీసుకొస్తున్న సమయంలో వారిని వేరేదారిలో తీసుకెళ్తున్నట్లు భక్తులు భావించారని హోంమంత్రి అనిత వివరించారు. అటువంటప్పుడు పోలీసులు ముందే అనౌన్స్ చేస్తే బాగుండేది కదా అన్న సీఎం చంద్రబాబు విషయాన్ని భక్తులకు అర్థమయ్యే రీతిలో మైక్ లో చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జలజీవన్ మిషన్ కింద ఏపీకి 12వేల కోట్ల రూపాయలు విడుదలకు కేంద్రం అంగీకరించిందని చంద్రబాబు వెల్లడించారు. జలజీవన్ పనులు 3ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాల్లో జరుగుతున్న ప్రాజెక్టులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే విధంగా ఇంఛార్జ్ మంత్రులు చూడాలని దిశానిర్దేశం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870