Andhra Pradesh-ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పోలీసు విభాగాల్లో భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయి. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ మొత్తం 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. వీరిలో 7 జిల్లాలకు పూర్తిగా కొత్త అధికారులను నియమించగా, మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీలు చేశారు. అయితే మిగిలిన 12 జిల్లాల్లో ప్రస్తుత ఎస్పీలను(Current SPs) కొనసాగించాలని నిర్ణయించారు.

జిల్లాల వారీగా కొత్త ఎస్పీలు
కొత్తగా నియమితులైన జిల్లాల్లో బీఆర్ అంబేడ్కర్ కోనసీమకు రాహుల్ మీనా, బాపట్లకు ఉమామహేశ్వర్, కృష్ణా జిల్లాకు విద్యాసాగర్ నాయుడు, నెల్లూరుకు అజితా వేజెండ్ల, తిరుపతికి సుబ్బరాయుడు, అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కునుగిలి, కడప జిల్లాకు నచికేత్ ఎస్పీలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
బదిలీలు చేసిన జిల్లాలు
అలాగే గుంటూరుకు వకుల్ జిందాల్, నంద్యాలకు సునీల్ షెరాన్, విజయనగరానికి ఏఆర్ దామోదర్, పల్నాడుకు డి.కృష్ణారావు, ప్రకాశానికి హర్షవర్ధన్ రాజు బదిలీ అయ్యారు. ఈ మార్పులు జిల్లాల పోలీసు వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని(new enthusiasm). నింపుతాయని, ప్రజలకు మరింత మెరుగైన భద్రత అందిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో ఎన్ని జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమించారు?
మొత్తం 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు.
కొత్త నియామకాల్లో ఎన్ని జిల్లాలకు పూర్తిగా కొత్త అధికారులను నియమించారు?
7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించారు.
Read hindi News: Hindi.vaartha.com
Read also: