Free Electricity Scheme: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం త్వరలో చేనేత కార్మికులకు శుభవార్త అందించనుంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలులో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu) సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేబినెట్ ఆమోదించిన ఈ పథకం ఆర్థికశాఖలో పెండింగ్లో ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు.
Read also: AP: క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీ పవర్..
మంత్రులు ఈ పథకం అమలు కాలేదని తెలపడంతో, వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా ప్రతి నెలా మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు.
ఈ ఉచిత విద్యుత్ పథకం అమలుతో చేనేత కార్మికులపై ఉన్న విద్యుత్ భారం గణనీయంగా తగ్గనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, మార్కెట్ ఒత్తిళ్ల మధ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరట కలిగించనుంది. అలాగే చేనేత పరిశ్రమను పునరుజ్జీవింపజేసి, గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: