ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై జరుగుతున్న విమర్శలు, తప్పుదోవ పట్టించే ప్రచారాలకు ముగింపు పలకేందుకు మరో కీలక చర్యకు సిద్ధమైంది. ప్రభుత్వం పెన్షనర్ల పేర్లను తొలగించిందని, అర్హులైన చాలా మందికి పెన్షన్లు నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా మరోసారి సర్వే నిర్వహించనుంది.
Read Also: YS Jagan: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్

ఈ సర్వేలో ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేసి, వారు నిజంగా పెన్షన్ అందుకుంటున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారిస్తారు. అలాగే పింఛన్ ఎంత సమయానికి వస్తోంది, పంపిణీ విధానంపై వారికి ఎలాంటి సమస్యలున్నాయా అనే అంశాలపై కూడా సమాచారం సేకరించనున్నారు. దీని ద్వారా వాస్తవ పరిస్థితిని తెలుసుకుని, తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.
లబ్ధిదారులు ఇచ్చే అభిప్రాయాలు, సమాధానాలను ఆధారంగా తీసుకుని కొత్త సంవత్సరంలో పెన్షన్ల పంపిణీ విధానంలో మార్పులు, మెరుగుదలలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే, అర్హత ఉన్నవారికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయా, ఎవరైనా అర్హులు మిస్సయ్యారా అనే అంశాలపై కూడా సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. ఈ IVRS(Interactive voice response system) సర్వేతో పెన్షన్ వ్యవస్థలో పారదర్శకత పెంపొందించడం, లబ్ధిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: