हिन्दी | Epaper

Andhra Pradesh: శ్రీకాళహస్తికి కూడా కల్తీ నెయ్యి సరఫరా

Rajitha
Andhra Pradesh: శ్రీకాళహస్తికి కూడా కల్తీ నెయ్యి సరఫరా

సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీ నుంచి సరఫరా

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయం, కాణిపాకం, ద్వారకా తిరుమల ఆలయాలకు సంబధించి 2022-2024లో సరఫరా చేసిన నెయ్యి కల్తీ అని ‘సిట్’ నివేదిక సమర్పించింది. తిరుమల నెయ్యి వ్యవహారం వివాదాస్పదంగా సాగుతుండగా సిట్ సమర్పించిన నివేదికలో తిరుమలకే (Tirumala) కాదు శ్రీకాళహస్తి ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి కూడా కల్తీ అని తేల్చారు. ఈ నెయ్యి సరఫరా చేసింది. సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సిలని తేల్చారు. అయితే కాంట్రాక్టర్లు ముందే సమాచారం తెలుసుకున్నట్లు ఉంది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రస్తుతం దేవస్థానంకు ఎస్ఎస్ఎన్ఆర్ పేరుతో సరకులతో పాటు, నెయ్యి సరఫరా చేస్తున్నారు. సిట్ నివేదికలో ఏముందంటే కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ అందించిన నివేదికలో ఇలా పేర్కొన్నారు.

Read also: Vigilance Raids Nellore: భారీగా అక్రమ గుట్కా, పాన్ మసాలా స్వాధీనం

Adulterated ghee supplied to Srikalahasti too

Adulterated ghee supplied to Srikalahasti too

శ్రీకాళహస్తీశ్వరాలయానికి నెయ్యి కిలో రూ.573లతో వైష్ణవి, భోలేబాబా ఆర్గానిక తిరుమల, విజయ, నందిని, సంఘం బ్రాండ్లలో ఏదైనా సరఫరా చేస్తామంటూ టెండర్లలో పేర్కొన్నారు. అయితే మొదట కొంత మేరకు తిరుమల నెయ్యిని అందించగా అత్యధికంగా ‘వైష్ణవి’ నెయ్యి సరఫరా చేసారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రసాదాల తయారి, పరివార దేవతలు, స్వామి అమ్మవార్ల గర్భగుడి వద్ద వెలిగించే దీపాలతో మసిబారుతుందని వాసన లేదని పేర్కొంది. అయితే నాడు అధికారులు కానీ అప్పటి పాలకులు కానీ పట్టంచుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నెయ్యి సరఫరాకు పాలకులు ససేమిరా! అన్నారు. నెలకు 7 టన్నుల నెయ్యి(500 డబ్బాలు) కొనుగోలు చేసారు. ఈ నెయ్యి డబ్బాలపై ఎలాంటి వివరాలు లేకుండా సరఫరా చేసారు.

నెలకు 7 టన్నుల కొనుగోలు – పర్యవేక్షణ లోపించిందా?

అయితే దేవాదాయశాఖ నిబంధనల మేరకు మరే ఇతర ఏజెన్సీలకు అర్హత దక్కదు. దాంతో సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీల ఇష్టారాజ్యంగా మారింది. వారు అడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అయితే ఈ సరఫరా దారులు ఎవరి వాటాలు వారికి గుట్టుచప్పుడు లేకుండా అందించటం వల్ల ఎవ్వరూ పట్టించుకోరు. సరకులు వచ్చాయా? దిగుమతి చేసుకున్నామా? అన్నట్లు మారింది. ఏజెన్సి పేరు మార్పుతో శ్రీకాళహస్తీశ్వరాలయానికి సంబంధించి నాడు నెయ్యిసరఫరాలో కల్తీ జరిగిందని సిట్ విచారణలో తేలింది. అయితే ఈ సమాచారం బహుశా ముందుగానే పసిగట్టారో ఏమో కానీ ప్రస్తుతం శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఎస్ ఎస్ ఎన్ ఆర్ పేరుతో సరఫరా జరుగుతుంది. మరి గతంలో జరిగిన అవకతవకలపై ఏం చర్యలు అనేది ప్రశ్నార్థంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870