Andhra Pradesh electric buses : ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో కీలక మార్పులు రానున్నాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి 750 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆయన ప్రకటించారు. విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో **ద్వారకా తిరుమలరావు**తో కలిసి స్త్రీశక్తి పథకంపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
స్త్రీశక్తి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సుమారు 40 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని ప్రభుత్వం భారంగా కాకుండా ప్రజల పట్ల ఉన్న బాధ్యతగా అమలు చేస్తోందని చెప్పారు. ఈ విజయానికి 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల కృషి ఎంతో కీలకమని ప్రశంసించారు.
Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు

ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు (Andhra Pradesh electric buses) ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. రెట్రోఫిట్మెంట్ బస్సులపై పరిశీలన కొనసాగుతోందని, అలాగే అధునాతన సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో సేవల్లోకి తీసుకువస్తామని తెలిపారు. పల్లెవెలుగు సర్వీసుల్లో కూడా ఏసీ సౌకర్యం కల్పించాలన్న ఆదేశాలను సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో పరిష్కారం కాని అనేక సమస్యలను కూటమి ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. టికెట్ ఆదాయంతో పాటు కార్గో సర్వీసుల ద్వారా ఆర్టీసీ రూ.200 కోట్ల ఆదాయం ఆర్జించిందని వెల్లడించారు. కార్గో ఆదాయంలో ఉత్తమ ప్రదర్శన చేసిన జిల్లా అధికారులను సత్కరించడంతో పాటు, విజయవాడ బస్టాండ్‌లో కొత్త కార్గో సర్వీస్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: