Ananthapuram: అనంతపురంలో ACB పేరును దుర్వినియోగం చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. “నేను ACB ఇన్‌ఫార్మర్‌ని… నీ వ్యవహారాలు నాకు తెలుసు. లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే” అంటూ నిరంతరం ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ చేస్తూ ఒక అధికారిని బెదిరించాడని పోలీసులు తెలిపారు.
Read also: Parliament: అమరావతి బిల్లు పై పెమ్మసాని వ్యాఖ్యలు

Threats made in the name of ACB
ఏం జరిగింది?
గార్లదిన్నె మండలం కోటంకకు చెందిన సురేష్, తనను ACB ఇన్‌ఫార్మర్‌గా పరిచయం చేసుకుని, ACB సీఐ హమీద్ ఖాన్ ఫోటోనే వాట్సాప్ DPగా పెట్టుకుని దందాకు పాల్పడ్డాడు. వ్యవసాయ శాఖ అనంతపురం (Anantapur) ఏడీ అల్తాఫ్ అలీఖాన్ ఫోన్‌లో సంప్రదించి, “నీపై ఉన్న వివరాలన్నీ నాకు తెలుసు… ఎన్‌ఆర్ ఫర్టిలైజర్స్ కేసులో డబ్బు తీసుకుని ఆటోలను వదిలేశావ్… లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా” అంటూ తరచూ బెదిరింపులు పంపాడు.
ఏడీఏ సమాధానంగా ఆటోలు కోర్టు పరంగా ఉన్నాయని చెప్పినా, అతడు వినకుండా మరింత రౌడీతనం ప్రదర్శించాడు. ఇలా రోజూ వాట్సాప్ కాల్స్‌తో ఇబ్బంది పడిన ACB, టూ టౌన్ పోలీసులను ఆశ్రయించగా… సీఐ శ్రీకాంత్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు సురేష్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై బెదిరింపు, ప్రభుత్వ ఉద్యోగి పనికి అంతరాయం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
సురేష్ గతం కూడా వివాదాలతోనే
సురేష్ గతంలో పురుగుల మందుల కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. రైతుల నుండి డబ్బు తీసుకుని డీలర్లకు చెల్లించకపోవడంతో ఉద్యోగం కోల్పోయాడు. అనంతరం ఎరువుల దుకాణంలో పనిచేసినా, అక్కడ కూడా వివాదాల కారణంగా వెళ్లగొట్టినట్లు సమాచారం. పలువురిని డబ్బుల కోసం బెదిరించినట్లుగా గతంలో గార్లదిన్నెలో కేసు నమోదైందని పోలీసులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: