అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో నలుగురు బాలికలు పురుగుమందు (వాస్మోల్) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నలుగురు విద్యార్థినుల్లో తాడిపత్రి మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు.
Read Also: Ananthapuram: ACB పేరుతో బెదిరింపులు.. నకిలీ ఇన్ఫార్మర్ అరెస్ట్

వార్డెన్ ఫిర్యాదుతో బాలికల భయాందోళన
ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై స్పష్టత లేదు కానీ, వార్డెన్ వసంత విద్యార్థినుల గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడమే దీనికి దారితీసినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసి, విద్యార్థినులు భయపడిపోయి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆసుపత్రికి తరలింపు: పరిస్థితి విషమం
విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం (Ananthapuram) సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికలకు ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, నలుగురు బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు విద్యార్థినుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భారీగా చేరుకున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను మాత్రం వెల్లడించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ఈ ఘటనతో కళాశాలలో ఉన్న మిగతా విద్యార్థినులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: