అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆచార్య కాలనీలో కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకున్న స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ గొడవలో మహేశ్ అనే వ్యక్తి తన చిన్నాన్న నాగేంద్రపై కట్టెతో దాడి చేసినట్లు సమాచారం. దాడి సమయంలో నాగేంద్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Read also: West bank: 16 ఏళ్ల బాలుడుని కాల్చి చంపిన ఇజ్రాయెల్ సైనికులు

Anantapur Crime
ప్రస్తుతం నాగేంద్ర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ ఘటనపై బాధితుడు నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కుటుంబ కలహాల కారణంగా ఈ స్థాయిలో హింస జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: