Anantapur : అనంతపురం అర్బన్ శాసనసభ స్థానం నుంచి గత ఎన్నికల్లో మొదటి సారిగా ఎన్నికైన పారిశ్రామికవేత్త దగ్గుబాటి వెంకట ప్రసాద్ (Daggubati Venkata Prasad) వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్న టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి పరోక్షంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ విలేకరుల సమయం ఏర్పాటు చేసి ఆరోపణ స్పందిస్తే అదే రోజు అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేరు చెప్పి డైరెక్టుగా ఘాటుగా స్పందించి కడిగిపారేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 14 నెల కాలంలో ఏదో విధంగా తనను బదనానం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, కొందరి టిడిపి నాయకులు ఆత్మహత్య చేసుకున్నారని, మహిళా తాళిబొట్టులు తెంచారని, సొసైటీ భూములను కాజేశారని తదితర ఆరోపణలను తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉద్దేశించి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పలు ఆరోపణలు చేశారు..
ఎమ్మెల్యే ఆరోపణలకు ప్రభాకర్ చౌదరి స్పందిస్తూ ఏడాదిన్నర కాలంలో అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే దగ్గుబాటి పార్టీని బ్రష్టు పట్టించారని, అనంతపురం ఎమ్మెల్యే చర్యల వల్ల ఇతరు నియోజకవర్గాల్లో కూడా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, కార్యకర్తలను, ఇతరులను ఎమ్మెల్యే ఏ విధంగా బెదిరించాలన్నది నా వద్ద ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని నేను ఇంతవరకు చెప్పలేదని, ఇద్దరిపై వచ్చిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమని, తేల్చుకునేందుకు సిద్ధమని ప్రభాకర్ చౌదరి సవాలు విసిరారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివా దంపై టిడిపి అధిష్టాన వర్గం ఎలా స్పందిస్తుందో అన్నది పార్టీ క్యాడర్ లో చర్చ జరుగుతోంది… సహజంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై గత కొన్ని నెలలుగా వివిధ ఆరోపణలు వస్తున్నాయి.
ఎమ్మెల్యే వర్గీయులు కబ్జాలకు పాల్పడుతున్నారు
కార్యకర్తలను బెదిరిస్తున్నారు అని, స్థల వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని. మద్యం షాపుల నిర్వహణలో దౌర్జన్యంగా వ్యవహరి స్తున్నారు అని. తదితర ఆరోపణలు బలంగా వచ్చాయి.. ఇందులో భాగంగా మద్యం మాఫియా డాన్ గా పేరున్న అనంతపురం టిడిపి నేత సుధాకర్ నాయుడు ను ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వర్గీయులు హత్యకు ప్లాంత్ చేసిన సంఘటన గతంలో చర్చనీయాంశం అయింది. ఈ విషయంలో సుధాకర్ నాయుడు జిల్లా ఎస్పీ జగదీష్ ని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. పత్రికల్లో, టీవీల్లో ఈ సంఘటన వార్తలు అప్పట్లో ప్రముఖంగా వచ్చారు. ఆ సమయంలో రాయల సీమ జిల్లాల టిడిపి (TDP) పరిశీలకుడు జోక్యం చేసుకొని ఎమ్మెల్యేను, సుధాకర్ నాయుడుని విజయవాడకు పిలిపించుకొని గట్టిగా మందలించారు. ఆ సంఘటన పై పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం సమీసి పోయి టీ కప్పులో తుఫానుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మొన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చేసుకున్నారు. ఇది మర్చిపోకముందే ఆదివారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆడియో వైరల్ అయ్యింది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2
సినిమాను అనంతపురంలో ఆడించే ప్రశ్నలేదని, తదితర విషయాలపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి మరో వ్యక్తితో మాట్లాడిన ఆడియో వివాదం ఆదివారం చర్చనీయాంశమైంది. ఆ ఆడియోతో తమకు సంబంధం లేదని ఎమ్మెల్యే చేసినప్పటికీ టిడిపిలో రసవత్తల చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయి అనంత పు రం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. అనంతపురం తో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో వివాదం వివా దాలు నెలకోడంతో ముగ్గురు ఎమ్మెల్యేలపై పార్టీ విచారణకు ఆదేశించింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :