Ananta Venkata Reddy : అనంతపురం మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయిన దివంగత అనంత వెంకట్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఘన నివాళులు అర్పించారు. సోమవారం ఆయన 26వ వర్ధంతి పురస్కరించుకుని ముందుగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న అనంత వెంకట్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో (Ananta Venkata Reddy) అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న అనంత వెంకట్ రెడ్డి ఘాట్‌కు చేరుకుని పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పాంజలులు సమర్పించారు.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీలు వై. శివరామిరెడ్డి, మంగమ్మ పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, డాక్టర్ శైలజనాథ్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, గుంతకల్ వై. వెంకట్రామిరెడ్డి హాజరై నివాళులు అర్పించారు.
అంతేకాకుండా అనంతపురం మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, రజక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ చాకలి రంగన్న, వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి, అనంత చంద్రారెడ్డి, కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరై అనంత వెంకట్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: