గుంటూరు (Guntur) జిల్లా తాజాగా మరో రాజకీయ ఉద్రిక్తతకు వేదికైంది. ఇటీవల జరిగిన ‘వెన్నుపోటు దినం’ (Backache Day) కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటనలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై పోలీసులను బెదిరించిన ఆరోపణలతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 353 (విధులకు ఆటంకం కలిగించడం) కింద కేసు నమోదైంది.

నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తతలు
గుంటూరులో వైసీపీ నేతలు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేకపోవడంతో, వారు తక్షణం ఆ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలంతో విమర్శించారు.
పోలీసు అధికారి గట్టి స్పందన
అంబటి రాంబాబు ప్రవర్తనపై సదరు పోలీస్ అధికారి కూడా ఎటువంటి వెనుకాడకుండా గట్టిగా స్పందించారు. ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ, వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో, విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీ నాయకులపైనా కేసులు నమోదు చేసినట్టు సమాచారం.
read also: Venigandla Ramu: చంద్రబాబుపై సవాలు విసిరిన నాని ఎక్కడ?..గుడివాడ ఎమ్మెల్యే