అమరావతి రాజధాని(Amaravati) విస్తరణ పేరుతో ప్రభుత్వం మరోసారి భూసేకరణ చేపట్టే ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి కథనం ఎప్పటికీ ముగియని కథలా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చిన వెంటనే అమరావతి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పడిపోయాయని అంబటి పేర్కొన్నారు.
Read also: టాప్ కమాండర్ హతంతో .. ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా వార్నింగ్

రాజధాని పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపణ
రాజధాని(Amaravati) నిర్మాణం పేరుతో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భారీ లాభాలు పొందాలని చూస్తున్నారని అంబటి ఆరోపించారు. ఇప్పటికే రైతులు స్వచ్ఛంద ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా 35 వేల ఎకరాల భూమిని అప్పగించారని, ప్రభుత్వ భూములతో కలిపి 50 వేల ఎకరాల విస్తీర్ణం రాజధానిగా రూపుదిద్దుకోవాల్సిందని గుర్తుచేశారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని పెద్ద మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్లీ భూసేకరణ అవసరం ఎందుకు ఏర్పడిందని అంబటి ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్ణయాలు అమరావతి రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టుతున్నాయని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రూపకల్పన, నిర్మాణంపై స్పష్టమైన దిశ ఇవ్వకుండా భూసేకరణపై పదేపదే నిర్ణయాలు ప్రకటించడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. రైతుల త్యాగాన్ని గౌరవించకుండా, వారికి నష్టం కలిగే చర్యలు తీసుకుంటుండటం దురదృష్టకరమని అంబటి విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: