పొట్టి శ్రీరాములు విగ్రహ నమూనాలను సీఎం పరిశీలన
విజయవాడ : రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తులో నిర్మించనున్న అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనా లను ముఖ్యమంత్రి చంద్రబాబు (చంద్రబాబు) పరిశీలించారు. బుధవారం సచి వాలయంలో ఏర్పాటు చేసిన ఈ నమూనాలను సీఎం పరిశీలించారు. రాజధాని(Amaravati) ప్రాంతంలోని శాఖమూరు లో 6.8 ఎకరాల్లో ప్రభుత్వం పొట్టిశ్రీరాములు స్మ్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ స్మృతి వనానికి గత నెల 3వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
Read also: మన్యంలో మళ్లీ రగులుతున్న పోలవరం

అమరావతిలో 58 అడుగుల విగ్రహ నిర్మాణానికి ప్రణాళిక
వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం(Amaravati) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విగ్రహ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ పారేపల్లి డూండీ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: