విజయవాడ : రాజధాని అమరావతిలో 2వ విడత భూసమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు జిల్లా తుల్లూరు(Amaravati) మండలంలోని 3 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. వడ్డమానులో 1,763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 అసైన్డ్ల్యాండ్ సమీకరించనున్నారు. హరిశ్చంద్రాపురంలో 1,448.09 ఎకరాలు పట్టా, 2.29 అసైన్డ్ ల్యాండ్ సహా పెదపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేయనున్నారు. 7గ్రామాల్లో కలిపి పట్టాభూమి 16,562.52 ఎకరాలు, 104.01 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరణ చేయనున్నారు. ఈ భూసమీకరణ బాధ్యతను సీఆర్డీఎ కమిషనర్కు అప్పగిస్తూ ప్రభుత్వం(Government) ఉత్త ర్వులు జారీ చేసింది. 7 గ్రామాల పరిధిలో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను కలుపుకుంటే మొత్తం 20,494 ఎకరాల భూమి అందుబాటులోకి రానుందని ఆదేశాల్లో ప్రభుత్వం వెల్లడించింది.
Read also: జైపూర్ వాక్స్ మ్యూజియంలో హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం

అమరావతిలో భూసమీకరణకు ఆదేశాలు
ఈ మేరకు(Amaravati) తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఎ కమిషనరు ప్రభుత్వం ఆదేశించింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెండవ విడతలో సేకరించిన భూములలో ప్రధానమైనవి నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్, రైల్వేలైన్ నిర్మాణాలు ఈ విడుతలో చేయనున్నారు. తాజా ఉత్తర్వులతో వీటన్నింటికి మార్గం సుగమమైంది. దీనితో పాటు రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న ఉత్తరదక్షిణం, తూర్పు, పడమర రహదారులు ఇన్నర్ రింగ్ రోడ్డుతో అను సంధానం కానున్నాయి. 7 గ్రామాల పరిథిలో 16,666.57 ລ ລ້, అసైన్డ్ భూమి సమీకరణ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: