అమరావతి(Amaravati) రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన దశను ప్రారంభించింది. రెండో విడత భూ సమీకరణ (Land pooling)కి అధికారికంగా అనుమతి ఇవ్వడం ద్వారా రాజధాని అభివృద్ధి పనులకు కొత్త ఊపు వచ్చింది. ఈ మేరకు ఏడు గ్రామాల పరిధిలో భూములను సమీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేస్తూ, సీఆర్‌డీఏ కమిషనర్‌కు అవసరమైన చర్యలు చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు.
Read also: Bullet Train: ఏపీలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు వేగం

16,666.57 ఎకరాల భూమి
ఈ దశలో అమరావతి(Amaravati) మరియు తుళ్లూరు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిను ల్యాండ్ పూలింగ్ ద్వారా పొందనున్నారు. దీనిలో 16,562.52 ఎకరాలు పట్టా భూములు, 104.01 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, అదనంగా 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా వినియోగానికి సిద్ధం కానుంది. దీంతో మొత్తం 20,494 ఎకరాలు రాజధాని నిర్మాణానికి అందుబాటులోకి వస్తాయి.
మండలాల వారీగా భూసమీకరణ వివరాలు
అమరావతి మండలం – 7,465 ఎకరాలు
- వైకుంఠపురం
- పెద్దమద్దూరు
- ఏంద్రాయి
- కర్లపూడి
- లేమల్లే
తుళ్లూరు మండలం – 9,097 ఎకరాలు
- వడ్లమాను
- హరిశ్చంద్రాపురం
- పెద్దపరిమి
ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడత భూ సమీకరణను పూర్తి చేసింది. రెండో విడత అమలు అయితే, అమరావతి రాజధాని ప్రాంతంలో భారీ స్థాయిలో మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన భూభాగం పూర్తిస్థాయిలో సిద్ధం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: