పెన్షన్ పథకం పునరుద్ధరణ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతి(Amaravati) పరిధిలోని భూమిలేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం నిలిపివేసిన పింఛన్ల పథకాన్ని పునరుద్ధరించాలని రాజ ధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్ డీఏ) నిర్ణయించింది. ఇటీవల జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా 4,929 మంది పేదలకు నెలకు రూ.5 వేల చొప్పున పింఛను అందనుంది. రాజధాని కోసం భూసమీకరణ జరిగినప్పుడు, భూమి లేక ఉపాధి కోల్పోయిన పేదల కోసం ప్రభుత్వం ఈ పింఛన్ పథకాన్ని ప్రారంభించింది.
Read also: అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం
అయితే, వైసీపీ ప్రభుత్వం(Amaravati) అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు నిలిపివేయడంతో పాటు ఈ పింఛన్లను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో, అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పింఛన్లను పునరుద్ధరించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఈ విషయంపై సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పింఛన్ల కోసం త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల్లో గానీ, గ్రామసభల ద్వారా గానీ పేదలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంతంలోని వేలాది పేద కుటుంబాలకు ఆర్థికంగా ఊరట దక్కుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: