Amaravati capital news : ఐదేళ్ల నిశ్శబ్దం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మళ్లీ పూర్వ వైభవం కనిపిస్తోంది. నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడంతో రాజధాని గ్రామాల్లో ఎక్కడ చూసినా కార్మికుల సందడి, యంత్రాల హోరు వినిపిస్తోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వేలాది మంది కార్మికులు నిత్యావసరాలు, బట్టల కొనుగోళ్ల కోసం వీధుల్లోకి రావడంతో అమరావతి ప్రాంతాలు పండగ వాతావరణాన్ని తలపించాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులకు మళ్లీ ఊపొచ్చింది. ప్రస్తుతం వివిధ నిర్మాణ పనుల్లో సుమారు 13 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా, జనవరి నాటికి ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది. పనుల వేగం మూడు రెట్లు పెంచే లక్ష్యంతో కాంట్రాక్టు సంస్థలు ఇప్పటికే మానవ వనరుల సరఫరా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జనవరిలో మరో 30 వేల మంది కార్మికులు అమరావతికి రానున్నట్లు అంచనా వేస్తున్నారు.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
భవనాల నిర్మాణంతో పాటు రైతులకు కేటాయించిన (Amaravati capital news) ప్లాట్లలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ట్రంక్ రోడ్లు, ఐకానిక్ భవనాల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 2014–19 మధ్య అమరావతిలో కనిపించిన చైతన్యం మళ్లీ రాజధాని ప్రాంతాల్లో కనిపిస్తుండటంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: