కుప్పం Airport : సిఎం చంద్ర బాబునాయుడు (CM Chandra Babu Naidu) ఆదేశాలతో కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం డొమెస్టిక్ ఎయిర్పోర్టు నిర్మించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఎయిర్పోర్టు నిర్మాణంకు అవసరమైన భూముల గుర్తింపుకు సంబంధించి అధికార యంత్రాంగం సర్వే పూర్తి చేసింది. కుప్పంలో దాదాపు 1829 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మాణంకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా సోమవారం 481 ఎకరాల భూసేకరణకు సంబంధించి అధికారులు రైతులకు ప్రిలిమనరీ నోటిఫికేషన్ (పిఎన్) నోటీసులు జారీ చేశారు. వీరికి రెండు నెలల గడువు ఇవ్వనున్నారు. కాగా 665 ఎకరాల భూములను (665 acres of land) ఎయిర్పోర్టు నిర్మాణంకు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. దీంతో ఎయిర్పోర్టు భూముల ఎకరాకు ప్రభుత్వంచే 16లక్షల పరిహారం : శాంతిపురం మండలం అమ్మవారిపేట, రామకుప్పం మండలం కిలాక్పోడు, గాంధీనగర్, మణీంద్రం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం అప్పట్లో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణంకు 2018-19లోనే దాదాపు 642 ఎకరాలను సేకరించడంతో పాటు దాదాపు రైతులకు అప్పట్లోనే పరిహారం ఇచ్చేసింది.
కుప్పం ఎయిర్‌పోర్టు భూములకు రైతులకు ఎకరాకు ₹16 లక్షల పరిహారం
మరో 13 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉండగా వడ్డీతో సహా కలిపి రైతులకు 25 కోట్లు చెల్లించాలని సిఎం చంద్రబాబునాయుడు ఆదేశించడంతో అది కూడా రైతులకు చెల్లించారు. 2019 వైఎస్సార్సీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక కుప్పం ఎయిర్పోర్టును రద్దు చేసింది. మరలా 2024లో సిఎంగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టడంతో కుప్పంలో డొమెస్టిక్ ఎయిర్పోర్టు నిర్మాణంకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా ప్రస్తుతం ఎయిరోపోర్టు నిర్మాణంకు భూములిచ్చే రైతులకు సిఎం చంద్రబాబునాయుడు ఎకరాకు 16లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో ఎకరాకు 5లక్షల ధర మాత్రమే పలుకుతున్నా సిఎం చంద్రబాబు రైతులు నష్టపోకూడదని 16లక్షల పరిహారం ఫిక్స్ చేశారు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :