మన దేశంలో నేడు ఊపిరి పీల్చుకోవడం కూడా అదృష్టం గా మారిన పరిస్థితి నెలకొంది. స్వచ్ఛమైన గాలి జీవన హక్కులో భాగమని రాజ్యాంగం చెబుతుంటే, వాస్తవంలో మాత్రం కోట్లాది మంది రోజూ విషగాలినే శ్వాసగా తీసుకుం టున్నారు. అభివృద్ధి అనే ముసుగులో మనం సృష్టించిన వాయు కాలుష్యం (Air pollution) ఇప్పుడు మౌనహంతకుడిగా మారి, ఎలాంటి హెచ్చరిక లేకుండానే ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తోం ది. రహదారులపై వాహనాల పొగ, పరిశ్రమల నుంచి ఎగసే దుమ్ము, చెత్త దహనం నుంచి వెలువడే విష వాయు వులు ఇవన్నీ కలిసి మన ఊపిరితిత్తులపై నిరంతర దాడి చేస్తున్నాయి. ఈ దాడికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వాలా? పరిశ్రమలా? ప్రజలా? నిజానికి ఈ మూడు కలిసిన నిర్లక్ష్యమే ఈ సంక్షోభానికి మూలం. నగరాల అభివృద్ధిని వాహనాల సంఖ్యతో కొలిచే మన దృక్పథమే గాలిని విషపూరితం చేసింది. ప్రతి కుటుంబానికి రెండు, మూడు వాహనాలు సాధారణమవుతున్న ఈ కాలంలో, ట్రాఫిక్ జామ్లు కేవలం సమయాన్ని కాదు, ఆరోగ్యాన్ని కూడాతినేస్తున్నాయి. డీజిల్, పెట్రోల్ వాహనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు గాలిలో కలసి కనిపించని గోడలా మన చుట్టూ ఏర్పడుతున్నాయి. పిల్లల ఊపిరితిత్తులు ఇంకా ఎదుగుతున్న దశలోనే విష వాయువులతో నిండిపోతున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్య కాదు. ఇది భవి ష్యత్ తరాలపై మోపుతున్న సామూహిక నేరం. పరిశ్రమల కాలుష్యం (Air pollution) మరో ఘోరమైన వాస్తవం. లాభాల కోసం నిబంధ నలను పక్కన పెట్టే పరిశ్రమలు, పర్యవేక్షణలో వైఫల్యం చూపుతున్న పాలకులు కలిసి గాలిని విషపూరితం చేస్తున్నారు.
Read Also: http://Central Govt: గిగ్ వర్కర్లకు శుభవార్త: 10 నిమిషాల డెలివరీ రద్దు

కాలుష్య నియంత్రణ పరికరాలు పత్రాలపై మాత్రమే ఉండటం, తనిఖీలు కాగితాలకే పరిమితం కావడం ఈ వ్యవస్థల నిర్లక్ష్యాన్ని ఎండగడుతోంది. విద్యుత్ అవసరాల పేరుతో బొగ్గును విపరీతంగా కాల్చడం, ప్రత్యామ్నాయ శక్తులపై నిర్లక్ష్యం చూపడం వల్ల వాతావరణ మార్పుల ముప్పు మరింత పెరుగుతోంది. అరణ్యాల నాశనం ఈ సమస్యకు నూనెపోస్తున్నట్లే. చెట్లులేకుండా అభివృద్ధి సాధ్య మన్న అపోహ మనకు ఊపిరాడనీయకుండా చేస్తోంది. అడ వులు కేవలం కలప నిల్వలు కాదు అవి గాలిని శుద్ధి చేసే సహజ ఫిల్టర్లు. కానీ రియల్ ఎస్టేట్, మైనింగ్, రహదారి ప్రాజెక్టుల పేరుతో అడవులను నరికేస్తూ, అదే సమయంలో గాలి విషమవుతోందని ఆందోళన వ్యక్తం చేయడం పరస్పర విరుద్ధత కాదు మరేమిటి? గ్రామీణ ప్రాంతాల్లో పంట అవశేషాలను కాల్చడం, పట్టణాల్లో చెత్తను తగలబెట్టడం వంటి అలవాట్లు ఈ విషవలయాన్ని మరింత బిగిస్తున్నాయి. వాయు కాలుష్యం ప్రభావాలు ఇక గణాంకాలకే పరిమితం కావడం లేదు అవి ఆసుపత్రులలో కనిపిస్తున్నాయి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. వైద్య ఖర్చులు కుటుంబాలను కుంగదీస్తున్నాయి. వాయుకాలుష్యం వల్ల ఏర్పడే ఆమ్లవర్షాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, అసాధారణ వర్షాలు ప్రకృతిలో అస మతుల్యతను సృష స్తున్నాయి. ఇది మనిషి ప్రకృతితో చేస్తు న్న యుద్ధఫలితం. ఈ సంక్షోభం నుంచి బయట పడాలంటే మాటలతో కాదు, కఠిన నిర్ణయాలతో ముందుకు రావాలి. ప్రజా రవాణాను బలపరచకుండా, వ్యక్తిగత వాహనాలపై ఆధారాన్ని తగ్గించకుండా గాలి శుద్ధి సాధ్యం కాదు.
-టి. శ్రీనివాస్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: